పెరిగిన విదేశీ మారకపు నిల్వలు

విదేశీ మారకపు నిల్వలు ఏప్రిల్‌ 30తో ముగిసిన వారానికి 3.913 బిలియన్‌ డాలర్లు పెరిగి 588.02 బిలియన్‌ డాలర్లకు చేరాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు పెరగడం ఇందుకు కారణం. అంతకుముందు వారం (ఏప్రిల్‌ 23తో ముగిసిన)లోనూ మారకపు నిల్వలు

Published : 08 May 2021 01:24 IST

ముంబయి: విదేశీ మారకపు నిల్వలు ఏప్రిల్‌ 30తో ముగిసిన వారానికి 3.913 బిలియన్‌ డాలర్లు పెరిగి 588.02 బిలియన్‌ డాలర్లకు చేరాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు పెరగడం ఇందుకు కారణం. అంతకుముందు వారం (ఏప్రిల్‌ 23తో ముగిసిన)లోనూ మారకపు నిల్వలు 1.701 బిలియన్‌ డాలర్లు పెరగడం గమనార్హం. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్‌ 30తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 4.413 బిలియన్‌ డాలర్లు అధికమై 546.059 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. పసిడి నిల్వలు 505 మిలియన్‌ డాలర్లు పెరిగి 35.464 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) వద్ద స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ 3 మిలియన్‌ డాలర్లు పెరిగి 1.508 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఐఎంఎఫ్‌ వద్ద దేశ నిల్వల స్థితి 2 మిలియన్‌ డాలర్లు పెరిగి 4.99 బిలియన్‌ డాలర్లకు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని