ఎయిర్‌బస్‌ డిఫెన్స్‌తో భారత రక్షణ శాఖ చరిత్రాత్మక ఒప్పందం.. రతన్‌ టాటా హర్షం

భారత రక్షణ రంగంలో మరో కీలక ఒప్పందం ఖరారైంది. ఎయిర్‌ బస్‌ డిఫెన్స్‌, స్పేస్‌ ఆఫ్‌ స్పెయిన్‌ కంపెనీలతో భారత రక్షణ శాఖ రూ.20,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకొంది. ఈ ఒప్పందంలో భాగంగా 56 ‘సీ-295 మీడియం ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌’లను అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత వాయుసేనలో ఉన్న అవ్రో-748 విమానాల  స్థానంలో వీటిని భర్తీ చేయనున్నారు.....

Published : 24 Sep 2021 22:51 IST

దిల్లీ: భారత రక్షణ రంగంలో మరో కీలక ఒప్పందం ఖరారైంది. ఎయిర్‌ బస్‌ డిఫెన్స్‌, స్పేస్‌ ఆఫ్‌ స్పెయిన్‌ కంపెనీలతో భారత రక్షణ శాఖ రూ.20,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకొంది. ఈ ఒప్పందంలో భాగంగా 56 ‘సీ-295 మీడియం ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌’లను అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత వాయుసేనలో ఉన్న అవ్రో-748 విమానాల  స్థానంలో వీటిని భర్తీ చేయనున్నారు.

ఒప్పందం ప్రకారం.. ఎయిర్‌బస్‌ డిఫెన్స్‌ సిస్టం, స్పేస్‌ ఆఫ్‌ స్పెయిన్‌ 16 విమానాలు పూర్తిగా విదేశాల్లోనే తయారు చేసి భారత్‌కు అందజేయాలి. ఒప్పందంపై సంతకాలు చేసిన 48 నెలల్లోగా వీటిని అందించాలి. మిగిలిన 40 విమానాలను ఎయిర్‌బస్‌ డిఫెన్స్‌ సిస్టం, స్పేస్‌ ఆఫ్‌ స్పెయిన్‌, భారత్‌కు చెందిన టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (టీఏఎస్‌ఎల్‌)లతో కూడిన కన్సార్టియం భారత్‌లో తయారు చేయాలి. ఒప్పందం ఖరారైన నాటి నుంచి 10 ఏళ్లలో వీటిని తయారు చేయాలి. ఇలా భారత్‌లో ఓ విదేశీ కంపెనీ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌ను తయారు చేయడం ఇదే తొలిసారి.

ఈ ఒప్పందంపై టాటా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా హర్షం వ్యక్తం చేశారు. ఎయిర్‌ బస్‌, టీఏఎస్‌ఎల్‌, రక్షణ శాఖకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌లో ఏవియేషన్‌, ఏవియానిక్స్‌ ప్రాజెక్టుల ప్రారంభానికి గొప్ప ముందడుగని వ్యాఖ్యానించారు. ఈ సీ-295 విమానాలకు 5-10 టన్నుల బరువును మోసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. తాజాగా తయారు చేయనున్న విమానాల్లో పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ వ్యవస్థను అమర్చనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని