బైట్‌డ్యాన్స్‌కు భారత్‌లో మరో షాక్!

నిషేధానికి గురైన ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ భారత్‌లో పన్ను ఎగవేసినట్లు అభియోగాలు వచ్చాయి. దీంతో ఆ సంస్థకు సిటీబ్యాంక్‌, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకుల్లో ఉన్న ఖాతాలను........

Published : 31 Mar 2021 14:12 IST

దిల్లీ: నిషేధానికి గురైన ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ భారత్‌లో పన్ను ఎగవేసినట్లు అభియోగాలు వచ్చాయి. దీంతో ఆ సంస్థకు సిటీబ్యాంక్‌, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకుల్లో ఉన్న ఖాతాలను అధికారులు స్తంభింపజేశారు. దీంతో చైనా సంస్థ అయిన బైట్‌డ్యాన్స్‌కు భారత్‌లో మరో ఎదురుదెబ్బ తగిలినట్లైంది. 

భారత అధికారుల నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన బైట్‌డ్యాన్స్‌.. ఉత్తర్వులను వెంటనే రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని సంప్రదించినట్లు సమాచారం. భారత్‌-చైనా సరిహద్దుల్లో సైనిక ఘర్షణల నేపథ్యంలో బైట్‌డ్యాన్స్‌కు చెందిన ప్రముఖ వీడియో యాప్‌ ‘టిక్‌ టాక్‌’పై కేంద్ర ప్రభుత్వం గతేడాది నిషేధం విధించిన విషయం తెలిసిందే.

ఆ నిషేధాన్ని అలాగే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో భారత్‌లో తమ సిబ్బంది సంఖ్యను బైట్‌డ్యాన్స్‌ గణనీయంగా తగ్గించింది. ప్రస్తుతం ఆ సంస్థకు మన దేశంలో 1,300 మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారు. వీరంతా బైట్‌డ్యాన్స్‌ విదేశీ వ్యాపార కార్యకలాపాలపై పనిచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని