business news: చైనా ఉత్పత్తులపై భారత్‌ యాంటీ డంపింగ్‌ డ్యూటీ

ఐదు రకాల చైనా ఉత్పత్తులపై భారత్‌ యాంటీ డంపింగ్‌ డ్యూటీని విధించింది. ఈ డ్యూటీలు ఐదేళ్లపాటు అమల్లో ఉంటాయి. పొరుగు దేశాల చౌక ఉత్పత్తుల కారణంగా స్థానిక ఉత్పత్తిదారుల ప్రయోజనాలు

Updated : 26 Dec 2021 19:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐదు రకాల చైనా ఉత్పత్తులపై భారత్‌ యాంటీ డంపింగ్‌ డ్యూటీని విధించింది. ఈ డ్యూటీలు ఐదేళ్లపాటు అమల్లో ఉంటాయి. పొరుగు దేశాల చౌక ఉత్పత్తుల కారణంగా స్థానిక ఉత్పత్తిదారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ‘ది సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌’ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ వస్తువుల జాబితాలో అల్యూమినియం, సోడియం హైడ్రోసల్ఫేట్‌, సిలికాన్‌ సీలెంట్‌, హైడ్రోఫ్లోరో కార్బన్‌, కాంపొనెంట్‌  ఆర్‌-32, హైడ్రోఫ్లోరో కార్బన్‌మిశ్రమాలు ఈ డ్యూటీల పరిధిలోకి వస్తాయని వెల్లడించింది. 

వాణిజ్య శాఖకు చెందిన డైరెక్టర్ జనరల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ అండ్‌ రెమిడీస్‌ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నారు. సాధారణంగా యాంటీ డంపింగ్‌ డ్యూటీలను ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల మేరకే విధిస్తారు. చౌకరకం దిగుమతుల కారణంగా దేశీయ పరిశ్రమలు దెబ్బతినే పరిస్థితుల్లో వీటిని వసూలు చేస్తారు. ఫలితంగా దేశీయ పరిశ్రమలు నిలదొక్కుకోవడానికి అవసరమైన మార్కెట్‌ పరిస్థితులు ఏర్పడతాయి. భారత్‌, చైనా ప్రపంచ వాణిజ్య సంస్థలో భాగస్వాములే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని