
UAV: మానవరహిత విమానాల కోసం భారత్-అమెరికా మధ్య ‘అగ్రిమెంట్’!
దిల్లీ: భారత్, అమెరికా మధ్య ఎయిర్-లాంచ్ మానవరహిత విమానాల కోసం ‘అగ్రిమెంట్’ అనే ప్రాజెక్టుపై ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మధ్య రక్షణ సాంకేతిక సహకారం మరింత బలోపేతమయ్యే దిశగా ఇది ఓ కీలక అడుగు. ‘డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్(డీటీటీఐ)లోని జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఎయిర్ సిస్టమ్స్ ఆధ్వర్యంలో ఇరు దేశాల రక్షణ శాఖలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి.
సహకార సాంకేతిక మార్పిడిని ప్రోత్సహించి వాటిని ఇరు దేశాల నాయకత్వ దృష్టిని తీసుకెళ్లడమే డీటీటీఐ ప్రధాన లక్ష్యం. అలాగే భారత్, అమెరికా సైనిక దళాల కోసం భవిష్యత్తు సాంకేతికతలను కలిసి అభివృద్ధి, ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని సముపార్జించాలి. డీటీటీఐ కింద సంబంధిత రంగాల్లో పరస్పరం కుదిరిన ఒప్పందాలపై దృష్టి సారించడానికి త్రివిధ దళాల్లో సంయుక్త వర్కింగ్ గ్రూపులు ఏర్పాటయ్యాయి. డీఆర్డీఓలోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఏడీఈ), ఎయిర్ ఫోర్స్ రీసెర్చ్ లాబొరేటరీ (ఏఎఫ్ఆర్ఎల్)లోని ఏరోస్పేస్ సిస్టమ్స్ డైరెక్టరేట్, సహా ఇరు దేశాల వాయుసేనలు ప్రాజెక్టు అగ్రిమెంటును అమలు చేయనున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.