Updated : 02 Dec 2021 16:28 IST

Stock Market: వరుసగా రెండో రోజూ లాభాలే..!

ముంబయి:  మొన్నటి దాకా భారీ నష్టాలు చవిచూసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు కొద్దీగా కుదుట పడ్డాయి. నిన్న మార్కెట్లో జోరు ప్రదర్శించిన బుల్‌.. ఇవాళ కూడా అదే జోష్‌ను కొనసాగించింది. మార్కెట్‌ ముగిసేసరికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 776 పాయింట్లు లాభపడి 58,461 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 234 పాయింట్లు లాభపడి 17,401 దగ్గర స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.74.99గా ఉంది. కరోనా కొత్త వేరియంట్‌  ఒమిక్రాన్‌తో పెద్దగా భయపడాల్సిన పనేమీ లేదని బూస్టర్‌ డోసుతో అడ్డుకోవచ్చని వస్తున్న వార్తలు స్టాక్‌ మార్కెట్‌ లాభాల వైపు అడుగులేసేందుకు కారణమయ్యాయి. అదానీ పోర్ట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్‌ గ్రిడ్‌, టాటా స్టీల్‌, సన్‌ ఫార్మా షేర్లు రాణించగా.. ఐసీఐసీఐ బ్యాంక్‌, సిప్లా తదితర షేర్లు డీలా పడ్డాయి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని