stock market: ఆసియా పసిఫిక్‌లో భారత షేర్లే అత్యంత ఖరీదైనవి..

ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌లోని కంపెనీల వాటాలే అత్యంత ఖరీదైనవని ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ క్రెడిట్‌ సూ పేర్కొంది. వీటిపై ఆదాయాయం ప్రస్తుత సంవత్సరంతో పోలిస్తే 2022లో ఓ మోస్తరుగా ఉంటుందని పేర్కొంది.

Published : 30 Nov 2021 20:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌లోని కంపెనీల వాటాలే అత్యంత ఖరీదైనవని ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ క్రెడిట్‌ సూ పేర్కొంది. వీటిపై ఆదాయం ప్రస్తుత సంవత్సరంతో పోలిస్తే 2022లో ఓ మోస్తరుగా ఉంటుందని పేర్కొంది. ఆసియా పసిఫిక్‌ రీజియన్‌లోని అన్ని దేశాల్లో కంపెనీ వాటాలపై ఆదాయం  పదిశాతం కూడా ఉండదని పేర్కొంది.

ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌కు 2021 అత్యున్న సమయమని క్రెడిట్‌ సూ సంస్థ అభిప్రాయపడింది. సెన్సెక్స్‌ ఇప్పటి వరకు 20శాతం పెరిగిందని పేర్కొంది. అదే అక్టోబర్‌లోని రికార్డు స్థాయి 62,245ను తీసుకొంటే  2021లో రాబడి 30శాతం వరకు ఉంటుందని పేర్కొంది. కరోనా మహమ్మారి నుంచి భారత్‌ అనుకున్నదాని కంటే వేగంగా కోలుకొంటోందని పేర్కొంది. ‘‘ 31శాతం ర్యాలీతో ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన మార్కెట్‌గా భారత్‌ నిలిచింది. 2022లో ఆసియాలోని ఇతర దేశాలకు చెందిన షేర్లతో సమానంగా భారత్‌వి కూడా రాణిస్తాయని భావిస్తున్నాం’’ అని క్రెడిట్‌ సూ వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని