crypto: భారతీయులకు బిట్‌కాయిన్లపై మనసు..!

భారతీయులు సహజంగా బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. కానీ, ఇటీవల కాలంలో క్రిప్టోకరెన్సీల వైపు మొగ్గారు. గతంలో 200 మిలియన్‌ డాలర్లుగా

Published : 28 Jun 2021 22:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారతీయులు సహజంగా బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. కానీ, ఇటీవల కాలంలో క్రిప్టోకరెన్సీల వైపు మొగ్గారు. గతంలో 200 మిలియన్‌ డాలర్లుగా ఉన్న పెట్టుబడి గతేడాది చివరి నాటికి 40 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు ‘చైన్‌ఎనాలసిస్‌’ సంస్థ పేర్కొంది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బిట్‌కాయిన్లపై వ్యతిరేకంగా ఉన్నా పెట్టుబడులు పెరగడం గమనార్హం. 2018లో డిజిటల్‌ కరెన్సీ మోసాలు పెరగడంతో ఆర్‌బీఐ క్రిప్టోకరెన్సీలను బ్యాన్‌ చేసింది. కానీ, 2020 మార్చిలో సుప్రీం కోర్టు ఈ ఆదేశాలను నిలిపివేసింది. 
చాలామంది పెట్టుబడిదారులు బంగారం నుంచి క్రిప్టోకరెన్సీల వైపు మొగ్గుతున్నారు. భారత్‌లో క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెట్టినవారి సంఖ్య సుమారు 1.5 కోట్లు ఉండొచ్చని అంచనా. ఈ విభాగంలో 2.3 కోట్ల మందితో అమెరికన్లు ముందున్నారు. బ్రిటన్‌లో 23 లక్షల మంది క్రిప్టోకరెన్సీల ట్రేడింగ్‌ చేస్తారు. ముఖ్యంగా 18-35 ఏళ్ల వారు ఎక్కువగా క్రిప్టోల వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. గోల్డ్‌ కౌన్సిల్‌ లెక్కల ప్రకారం 34 ఏళ్ల లోపు వారిలో బంగారం కొనేవారి సంఖ్య పెరుగుదల బాగా తగ్గినట్లు తేల్చారు. ఇక రోజువారి క్రిప్టో కరెన్సీల ట్రేడింగ్‌ కూడా 10.6 మిలియన్‌ డాలర్ల నుంచి 102 మిలియన్‌ డాలర్లకు చేరింది. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని