GDP: 4 దశాబ్దాల కనిష్ఠానికి జీడీపీ

కరోనా మహమ్మారి ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై గట్టిగానే పడింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.3 శాతం క్షీణత నమోదు చేసింది. నాలుగు

Published : 31 May 2021 19:02 IST

దిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై గట్టిగానే పడింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.3 శాతం క్షీణత నమోదు చేసింది. నాలుగు దశాబ్దాల చరిత్రలో ఇదే కనిష్ఠం కావడం గమనార్హం. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) సోమవారం సంబంధిత గణాంకాలను వెలువరించింది. 

2020-21 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 1.6 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు ఎన్‌ఎస్‌వో వెల్లడించింది. మూడో త్రైమాసికంతో పోలిస్తే 0.5 శాతం పెరుగుదల నమోదు చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 3 శాతం వృద్ధి నమోదైంది. పొరుగు దేశం చైనా జనవరి- మార్చి త్రైమాసికంలో 18.3 శాతం వృద్ధి రేటును నమోదు చేయడం గమనార్హం.

అంతకుముందు ఏడాది (2019-20) ముఖ్యంగా తయారీ, నిర్మాణ రంగాల్లో స్తబ్దత కారణంగా దేశ జీడీపీ 4.2 శాతానికే పరిమితమైంది. ఇది 11 ఏళ్ల కనిష్ఠం. కరోనా మహమ్మారి చుట్టు ముట్టడంతో 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏకంగా 24.38 శాతం క్షీణత నమోదైంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది జనవరిలో వెలువరించిన తొలి విడత అంచనాల్లో 7.7 శాతం క్షీణతను అంచనా వేయగా.. తర్వాత దాన్ని 8 శాతం ఉంటుందని ఎన్‌ఎస్‌వో సవరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని