Mahindra And Mahindra: చిప్స్‌ ఎఫెక్ట్‌.. మహీంద్రా కార్ల ఉత్పత్తిలో కోత..!

కార్లలో వినియోగించే చిప్స్‌కు తీవ్రమైన కొరత ఏర్పడటంతో సెప్టెంబర్‌ నెల ఉత్పత్తిలో 20-25శాతం వరకు తగ్గుదల కనిపించవచ్చని మహీంద్రా అండ్‌ మహీంద్రా

Published : 02 Sep 2021 20:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కార్లలో వినియోగించే చిప్స్‌కు తీవ్రమైన కొరత ఏర్పడటంతో సెప్టెంబర్‌ నెల ఉత్పత్తిలో 20-25శాతం వరకు తగ్గుదల కనిపించవచ్చని మహీంద్రా అండ్‌ మహీంద్రా గురువారం పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్‌ వస్తువులకు డిమాండ్‌ పెరగడంతో సెమీకండక్టర్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఇది ఆటోమొబైల్‌ పరిశ్రమలకు ఇబ్బందులు సృష్టిస్తోంది. దీంతో ఈ నెల మహీంద్రా ఆటోమోటీవ్‌ డివిజన్‌ ప్లాంట్‌లో ఏడు రోజుల పాటు ఉత్పత్తిని నిలిపివేసే అవకాశం ఉంది.  

ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్‌ఛేంజి ఫైలింగ్‌లో పేర్కొంది. ఉత్పత్తి నిలిచిపోవడం ఆదాయం, లాభాలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో మహీంద్రా షేర్లు స్టాక్‌ మార్కెట్లు 1శాతం విలువ కోల్పోయాయి. కాకపోతే ట్రాక్టర్లు,ట్రక్‌లు, బస్సులు, త్రీవీలర్స్‌ వ్యాపారంపై మాత్రం దీని ప్రభావం ఉండదని పేర్కొంది. 

ఈ వారం మొదట్లో మారుతీ సుజుకీ కూడా ఇటువంటి అభిప్రాయమే వెల్లడించింది. హర్యానా, గుజరాత్‌ల్లోని ప్లాంట్లు సెమీకండక్టర్ల సమస్యను ఎదుర్కోవచ్చని అభిప్రాయపడింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని