Infosys Q3 Results : ఇన్ఫోసిస్‌ లాభాల్లో 12 శాతం వృద్ధి

దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఈ ఏడాది మూడో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది.....

Published : 12 Jan 2022 17:27 IST

బెంగళూరు: దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఈ ఏడాది మూడో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. 11.8 శాతం ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసి రూ.5,809 కోట్లు ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.5,197 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు ఇన్ఫోసిస్‌ బీఎస్‌ఈకి అందజేసిన ఫైలింగ్‌లో తెలిపింది. ఇక క్రితం త్రైమాసికంతో పోలిస్తే లాభాలు 7.1 శాతం మేర పెరిగాయి.

* కంపెనీ ఆదాయం 23 శాతం వృద్ధి చెంది రూ.31,867 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.25,927 కోట్ల ఆదాయం నమోదయ్యింది. 

* ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి అంచనాలను 19.5 - 20 శాతంగా అంచనా వేసింది. గతంలో దీన్ని 16.5 - 17.5 శాతంగా అంచనా వేసింది.

* కంపెనీ బ్యాంకింగ్‌, ఫినాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ విభాగాల ద్వారా వస్తోన్న ఆదాయంలో 16.85 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. 

* తమ కంపెనీపై క్లయింట్లకు ఉన్న నమ్మకానికి ఈ ఫలితాలే నిదర్శనమని కంపెనీ ఎండీ, సీఈఓ సలీల్‌ పరేఖ్‌ తెలిపారు. వివిధ కంపెనీలకు డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో తమ సంస్థ అండగా నిలుస్తోందన్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ ఆదాయ అంచనాలను 19.5-20 శాతానికి సవరించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని