బీమా ప్రీమియంల‌ జీఎస్‌టీపై ప‌న్ను మిన‌హాయింపు పొందవచ్చని మీకు తెలుసా?

ఇప్ప‌టికే పెట్టుబ‌డుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను అందించాల్సిందిగా సంస్థ‌లు ఇప్ప‌టికే కోర‌తాయి. అయితే సెక్ష‌న్ 80 సి, సెక్ష‌న్ 80డి కింద జీవిత‌, ఆరోగ్య బీమా ప్రీమియంల‌పై ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంద‌ని సాధార‌ణంగా అంద‌రికి తెలిసిన విష‌య‌మే. అయితే ఈ ప్రీమియంలపై చెల్లించే పన్నుపై మినహాయింపును పొందవచ్చని మీకు తెలుసా?..

Updated : 01 Jan 2021 18:08 IST

ఇప్ప‌టికే పెట్టుబ‌డుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను అందించాల్సిందిగా సంస్థ‌లు ఇప్ప‌టికే కోర‌తాయి. అయితే సెక్ష‌న్ 80 సి, సెక్ష‌న్ 80డి కింద జీవిత‌, ఆరోగ్య బీమా ప్రీమియంల‌పై ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంద‌ని సాధార‌ణంగా అంద‌రికి తెలిసిన విష‌య‌మే. అయితే ఈ ప్రీమియంలపై చెల్లించే పన్నుపై మినహాయింపును పొందవచ్చని మీకు తెలుసా?
జీవిత లేదా ఆరోగ్య బీమా ప్రీమియంల‌పై జీఎస్‌టీ వ‌ర్తిస్తుంది. జీఎస్‌టీతో క‌లిపి ప్రీమియం మ‌రింత పెరుగుతుంది. కొనుగోలు చేసిన పాల‌సీని బ‌ట్టి జీఎస్‌టీ ఉంటుంది. జీఎస్‌టీ ఏ పాల‌సీకి ఎంత ప‌డుతుందో తెలుసుకుందాం

ఆరోగ్య బీమా
ఆరోగ్య బీమా పాల‌సీల‌పై జీఎస్‌టీ 18 శాతం వ‌ర్తిస్తుంది. అంటే మీ ప్రీమియం రూ.21,000 అనుకుంటే, జీఎస్‌టీ రూ.3,960 తో క‌లిపి రూ.24,960 మొత్తం ప్రీమియం చెల్లించాలి. జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలతో సహా మీ కుటుంబం కోసం తీసుకున్న ఆరోగ్య పాలసీ కోసం చెల్లించిన ప్రీమియంల కోసం సెక్షన్ 80 డి కింద లభించే రూ. 25,000 తగ్గింపు పరిమితిని పూర్తిగా క్లెయిమ్ చేసుకోవ‌చ్చు .

జీవిత బీమా
ఇక జీవిత బీమా విష‌యానికొస్తే ప్రీమింయ‌ల‌పై పాల‌సీ ర‌కాన్ని బట్టి వేర్వేరుగా జీఎస్‌టీ వ‌ర్తిస్తుంది. అయితే ఇక్క‌డ కూడా సెక్ష‌న్ 80సి కింద ఉన్న ప‌న్ను మిన‌హాయింపు రూ.1.5 లక్ష‌ల లోపు ప‌రిమితి లోపు జీఎస్‌టీ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

ట‌ర్మ్ ప్లాన్ అయితే, జీఎస్‌టీ మొత్తం ప్రీమియంపై 18 శాతం వ‌ర్తిస్తుంది. ఉద‌హ‌ర‌ణ‌కు దూమ‌పానం అల‌వాటు లేని ఒక 20 ఏళ్ల వ్య‌క్తి 20 ఏళ్ల కాల‌ప‌రిమితితో కూడిన‌ కోటి రూపాయ‌ల పాల‌సీకి రూ.9000 ప్రీమియం చెల్లిస్తున్నాడ‌నుకుంటే దీనిపై జీఎస్‌టీ రూ.1,620. ఇప్పుడు మొత్తం ప్రీమియం రూ.10,620 అవుతుంది. ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.
బీమా, పెట్టుబ‌డి క‌లిపి ఉండే యులిప్స్‌లో జీఎస్‌టీ కేవ‌లం ఛార్జీలపై ప‌డుతుంది. పెట్టుబ‌డిపై ఉండ‌దు. ఛార్జీలు అంటే ప్రీమియం కేటాయింపు, పాల‌సీ అడ్మినిస్ర్టేస‌న్‌, ఫండ్ మేనేజ్‌మెంట్, మోర్టాలిటీ ఛార్జీలు.

ఇక ఇక్క‌డ కూడా బీమాతో పాటు పెట్టుబ‌డి క‌లిపి ఉండే ఎండోమెంట్ పాల‌సీల‌పై మొద‌టి ఏడాది ప్రీమియంపై జీఎస్‌టీ 25 శాతం ప‌డుతుంది. దీంతో ఆ ఏడాది చెల్లించే ప్రీమియంపై జీఎస్‌టీ రేటు 4.5 శాతానికి త‌గ్గుతుంది. త‌రువాత సంవ‌త్స‌రాల్లో మొత్తం ప్రీమియంలో 12.5 శాతం జీఎస్‌టీ వ‌ర్తిస్తుంది. ఇక ఆ త‌ర్వాల కాలానికి మొత్తం జీఎస్‌టీ రేటు 2.25 శాతానికి తగ్గుతుంది

కాబట్టి మీరు మీ సంస్థ‌కు అందించిన పెట్టుబడి రుజువు ప‌త్రాల‌లో జీవిత, ఆరోగ్య బీమా పాలసీల కోసం చెల్లించిన ప్రీమియంల వివరాలను అందించేట‌ప్పుడు, జీఎస్టీతో సహా చెల్లించిన మొత్తం ప్రీమియం గురించి చెప్పడం మర్చిపోవద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని