బీమాకు సంబంధించిన‌  పదాలు - అర్థాలు  

బీమా కంపెనీ నెట్‌వ‌ర్క్‌ ఆసుపత్రులలో  బీమాదారుడు నగదు చెల్లించకుండా చికిత్స పొంద‌వ‌చ్చు

Updated : 28 Jun 2021 17:26 IST

నగదు రహిత చికిత్స: బీమా కంపెనీ నెట్‌వ‌ర్క్‌ ఆసుపత్రులలో  బీమాదారుడు నగదు చెల్లించకుండా చికిత్స పొంద‌వ‌చ్చు.

బీమా హామీ మొత్తం : పాలసీలో ఎంచుకున్న  బీమా హామీని బట్టి  గరిష్ఠ మొత్తానికి క్లెయిమ్ పొందే వీలుంది. పాలసీదారుడు ఎంచుకున్న ఆరోగ్య బీమా హామీ మొత్తాన్ని బట్టి ప్రీమియం ఉంటుంది.

క్రిటికల్ ఇల్నెస్ పాలసీ: బీమా సంస్థ ప‌రిగ‌ణించిన‌ తీవ్ర వ్యాధుల్లో దేనికైనా చికిత్స కోసం ఒకేసారి పెద్ద మొత్తంలో(బీమా హామీని బట్టి) చెల్లించే అవ‌కాశం.

వైకల్య బీమా హామీ (డీసెబిలిటీ ) : ఆనారోగ్యం లేదా ప్రమాదం వలన పాలసీదారుడు పూర్తి లేదా పాక్షిక  వైకల్యానికి గురైతే, సంపాదించలేని కాలంలో బీమా కంపెనీ చెల్లించే సొమ్ము.

డిడక్టబుల్ : మొత్తం క్లెయిమ్లో  కొంత మొత్తాన్ని పాలసీదారుడు భరించవలసి ఉంటుంది. ఆ ఫై మొత్తానికి  మాత్రమే బీమా కంపెనీ చెల్లిస్తుంది. అందువలన డిడక్టబుల్ ఎక్కువ ఉంటే.. ప్రీమియం తగ్గుతుంది.

మినహాయింపులు: బీమా పాలసీ కవర్ చేయని వ్యాధులు. వీటిలో రెండు రకాలు: 1) శాశ్వతంగా కవర్ చేయనివి 2) కొన్ని ఏళ్ల తరువాత కవర్ అయ్యేవి.

ఉప-పరిమితి (సబ్ లిమిట్ ) : చికిత్స సమయంలో తీసుకునే కొన్ని ఖర్చులపై (గది అద్దె లాంటివి ) పరిమితిని విధించడం. ఇవి ఖర్చులో కొంత మొత్తంగా గానీ లేదా కొంత శాతంగా గానీ ఉంటాయి.

లోడింగ్ : పాలసీ పునరుద్ధరణ సమయంలో ప్రీమియం పెంపు. సాధారణంగా గత ఏడాది ఏదైనా క్లెయిమ్‌లు ఉంటే, లోడింగ్‌ను విధిస్తారు.

నో క్లెయిమ్ బోనస్ : ఏదైనా సంవత్సరంలో ఎటువంటి  క్లెయిమ్ చేయ‌క‌పోతే పాలసీ పునరుద్ధరణ సమయంలో  ప్రీమియంలో తగ్గింపు లేదా బీమా హామీ పెంపు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts