మానసిక అనారోగ్యానికీ పరిహారం ఇవ్వాల్సిందే

మానసిక అనారోగ్య చికిత్సకు పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత బీమా సంస్థలకు ఉంటుందని దిల్లీ హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. 2018 నుంచి అమల్లోకి వచ్చిన మెంటల్‌ హెల్త్‌కేర్‌ చట్టం 2017 ప్రకారం బీమా సంస్థలు.....

Updated : 25 Apr 2021 18:01 IST

బీమా సంస్థలకు స్పష్టం చేసిన దిల్లీ హైకోర్టు

దిల్లీ: మానసిక అనారోగ్య చికిత్సకు పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత బీమా సంస్థలకు ఉంటుందని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. 2018 నుంచి అమల్లోకి వచ్చిన మెంటల్‌ హెల్త్‌కేర్‌ చట్టం 2017 ప్రకారం బీమా సంస్థలు ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేవని చెప్పింది. పరిహారాన్ని నిరాకరించడం చట్ట లక్ష్యాన్ని దెబ్బతీయడమేనని పేర్కొంది. బీమా సంస్థలు చట్ట ప్రకారం నడుచుకుంటున్నాయా లేదా అని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఐఆర్‌డీఏదేనని పేర్కొంది. ఒకవేళ నియంత్రణ సంస్థ పట్టించుకోకపోతే.. చట్ట ప్రకారం దానిపైనా చర్య తీసుకునేందుకు వీలుందని తెలిపింది. స్కిజోఫ్రినియా చికిత్సకు సంబంధించి నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ పరిహారం ఇవ్వడానికి నిరాకరించడంతో ఒక మహిళ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్‌ ప్రతిభా ఎం సింగ్‌ తీర్పును వెల్లడిస్తూ.. ఐఆర్‌డీఏ బీమా సంస్థలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తోందని అర్థం అవుతోందన్నారు. మహిళకు రూ.6.67 లక్షల పరిహారం చెల్లించాల్సిందిగా బీమా సంస్థను ఆదేశించడంతోపాటు, మరో రూ.25,000 అదనంగా చెల్లించాలని తీర్పిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు