భారత్‌లో 5జీ అభివృద్ధికి ఇంటెల్‌-ఎయిర్‌టెల్‌ జట్టు

భారత్‌లో 5జీ సాంకేతికత అభివృద్ధికి ఇంటెల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు టెలికాం ఆపరేటర్‌ భారతీ ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. వర్చువల్‌, ఓపెన్‌ రేడియో యాక్సెస్‌ నెట్‌వర్క్‌ సాంకేతికతలతో 5జీ వ్యవస్థను

Published : 22 Jul 2021 01:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌లో 5జీ సాంకేతికత అభివృద్ధికి ఇంటెల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు టెలికాం ఆపరేటర్‌ భారతీ ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. వర్చువల్‌, ఓపెన్‌ రేడియో యాక్సెస్‌ నెట్‌వర్క్‌ సాంకేతికతలతో 5జీ వ్యవస్థను సొంతంగా అభివృద్ధి చేయనున్నట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. భారతీ ఎయిర్‌టెల్‌తో పాటు ఇతర మొబైల్‌ ఆపరేటర్లు కూడా ఎంపిక చేసిన నగరాల్లో 5జీ పరీక్షలను నిర్వహిస్తున్నాయి. వర్చువల్‌, అగ్‌మెంటెడ్‌ రియాల్టీ, క్లౌడ్‌ గేమింగ్‌ వినియోగాలు పెరిగిన నేపథ్యంలో.. భారత్‌లో 5జీ రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేసేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని సంస్థ సీటీఓ రణ్‌దీప్‌ సిఖోన్‌ తెలిపారు. ఇంటెల్‌ నుంచి ఇటీవలే వచ్చిన మూడో తరం జీనాన్‌ స్కేలబుల్‌ ప్రాసెసర్లను, ఇతర పరికరాలను ఎయిర్‌టెల్‌ 5జీ సేవలకు వినియోగించనుంది.


గ్రామీణ విపణిలో 50 లక్షల వాహనాల విక్రయం: మారుతీ

దిల్లీ: దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎమ్‌ఎస్‌ఐ) ఇప్పటివరకు గ్రామీణ విపణిలో 50 లక్షల వాహనాలను విక్రయించినట్లు వెల్లడించింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 1,700 విక్రయశాలల నుంచే సుమారు 40 శాతం వరకు అమ్మకాలు నమోదవుతున్నాయని పేర్కొంది.  ‘మా వినియోగదార్ల మద్దతు, స్థానిక డీలర్ల భాగస్వామ్యంతో గ్రామీణ భారతంలో సంచితంగా 50 లక్షల వాహనాల మార్కును అధిగమించామని సగర్వంగా ప్రకటిస్తున్నామ’ని ఎమ్‌ఎస్‌ఐ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌, సేల్స్‌) శశాంక్‌ శ్రీవాత్సవ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని