పీఎఫ్‌ మొత్తాలపై పన్ను!

ట్యాక్స్‌ మినహాయింపులతో పాటు అధిక వడ్డీని పొందేందుకు కొందరు వాలంటరీ ప్రావిడెంట్‌ ఫండ్‌ (వీపీఎఫ్‌)ను వినియోగించుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఈ సారి బడ్జెట్‌లో చేదు వార్త. ఇకపై ఏడాదిలో రూ.2.5 లక్ష.......

Updated : 01 Feb 2021 21:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ట్యాక్స్‌ మినహాయింపులతో పాటు అధిక వడ్డీని పొందేందుకు కొందరు వాలంటరీ ప్రావిడెంట్‌ ఫండ్‌ (వీపీఎఫ్‌)ను వినియోగించుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఈ సారి బడ్జెట్‌లో చేదు వార్త. ఏడాదిలో రూ.2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఉద్యోగి వాటా (12శాతం), వీపీఎఫ్‌ కింద జమ అయ్యే మొత్తాలపై ఇక పన్ను భారం పడనుంది. ఒకే ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన దానికంటే అధికంగా జమ చేసిన మొత్తాలపై వచ్చే వడ్డీపై ఈ పన్ను విధించనున్నారు.

ఈ పన్ను ప్రభావం ఎక్కువ మొత్తంలో జీతం పొందే వారిపై మాత్రమే ఉండనుంది. మొత్తం పీఎఫ్‌ చందాదారుల్లో కేవలం ఒక్క శాతం మందిపై ఈ ప్రభావం ఉండబోతోందని విశ్లేషకులు అంటున్నారు. నెలకు సుమారు రూ.20వేలకు మించి పీఎఫ్‌ ఖాతాల్లో జమ చేసే వారిపై ఈ పన్ను పోటు పడనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం పీఎఫ్‌ మొత్తాలపై వార్షికంగా 8.5 శాతం వడ్డీ వస్తోంది.

ఇవీ చదవండి..
మరో ఏడాది అదనపు వడ్డీ ‘అందుబాటు’!
పసిడి పడింది‌.. వెండి పెరిగింది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని