బీపీసీఎల్‌ రేసులో అంతర్జాతీయ దిగ్గజాలు

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(బీపీసీఎల్‌)ను కొనుగోలు చేయడానికి ఇప్పటికే రేసులో ఉన్న పెట్టుబడుల సంస్థలతో అంతర్జాతీయ చమురు దిగ్గజాలు జట్టుకట్టవచ్చని తెలుస్తోంది. అంతర్జాతీయ దిగ్గజాల్లో ఒకరు లేదా మధ్యప్రాచ్య చమురు తయారీ కంపెనీ ఒకటి ఇప్పటికే రేసులో

Updated : 27 Aug 2021 01:29 IST

దిల్లీ: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(బీపీసీఎల్‌)ను కొనుగోలు చేయడానికి ఇప్పటికే రేసులో ఉన్న పెట్టుబడుల సంస్థలతో అంతర్జాతీయ చమురు దిగ్గజాలు జట్టుకట్టవచ్చని తెలుస్తోంది. అంతర్జాతీయ దిగ్గజాల్లో ఒకరు లేదా మధ్యప్రాచ్య చమురు తయారీ కంపెనీ ఒకటి ఇప్పటికే రేసులో ఉన్న కంపెనీలతో జట్టుకట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.  బీపీసీఎల్‌ ప్రైవేటీకరణను పూర్తి చేసే ప్రక్రియను వివరించే ఒక పత్రం ఈ అంశాలను వెల్లడించింది. బీపీసీఎల్‌లో ప్రభుత్వానికి చెందిన 52.98 శాతం వాటాను కొనుగోలు చేయడం కోసం అనిల్‌ అగర్వాల్‌కు చెందిన వేదాంతా గ్రూప్‌తో పాటు; రెండు అమెరికా ఫండ్‌ సంస్థలు (అపోలో గ్లోబల్‌, ఐ స్క్రేర్డ్‌ క్యాపిటల్‌) గతేడాది ప్రాథమిక బిడ్‌లు దాఖలు చేశాయి. కన్సార్షియంలు ఏర్పడుతున్నందున బిడ్డర్లకు ‘భద్రతా పరమైన అనుమతులు’ కూడా అవసరం కావొచ్చు.


రేసులో వీరు లేరు!!

భారత కుబేరులు ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీలతో పాటు అంతర్జాతీయ చమురు దిగ్గజ సంస్థలైన రాయల్‌ డచ్‌ షెల్‌, బీపీ, ఎక్సాన్‌లు బీపీసీఎల్‌ కోసం బిడ్‌లను సమర్పించలేదు. లక్ష్మీ మిత్తల్‌కు కూడా బీపీసీఎల్‌పై ఆసక్తి లేదని తెలుస్తోంది. ప్రస్తుత మార్కెట్‌ ధరల వద్ద రూ.80,000 కోట్ల మేర బీపీసీఎల్‌ కొనుగోలుకు వెచ్చించాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.



బైజూస్‌ నుంచి మరో సదుపాయం

దిల్లీ: పాఠశాల ముగిసిన అనంతరం ఇచ్చే ఆన్‌లైన్‌ శిక్షణ కోసం సరికొత్తగా ‘ఇద్దరు టీచర్ల’ సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ వెల్లడించింది. మెరుగైన బోధన, ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఈ ఫీచర్‌ రూపొందించామంది. నెలకు దాదాపు రూ.2500 చెల్లించి ఈ సదుపాయాన్ని పొందొచ్చు. ఇందులో విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు దృశ్యాలను వినియోగించి పాఠ్యాంశాలను వివరిస్తారు. రెండో ఉపాధ్యాయుడు సందేహాల నివృతి, వ్యక్తిగత పర్యవేక్షణ, తరగతుల్లో జరిగిన వాటిపై చర్చలు వంటి వాటిని చూసుకుంటారు. భారత ఆన్‌లైన్‌ ట్యూషన్‌ విభాగంలో ఈ విధానం చాలా ప్రత్యేకమైనదని బైజూస్‌ సీఈఓ మృణాల్‌ రోహిత్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని