వీపీఎఫ్ లో పెట్టుబడి పెట్టండి, రిటైర్మెంట్ ఫండ్ ని బ్యాలన్స్ చేసుకోండి..

మూడు నెలల్లో మీ ఈపీఎఫ్ సహకారంలో మొత్తం 6 శాతం తగ్గింపు మీ మొత్తం పదవీ విరమణ కార్పస్‌లో భారీ తగ్గింపు తప్పదని గమనించండి......

Published : 24 Dec 2020 16:20 IST

మూడు నెలల్లో మీ ఈపీఎఫ్ సహకారంలో మొత్తం 6 శాతం తగ్గింపు మీ మొత్తం పదవీ విరమణ కార్పస్‌లో భారీ తగ్గింపు తప్పదని గమనించండి

నగదు సంక్షోభం ఎదుర్కొంటున్న ఉద్యోగులు, యజమానులకు ఉపశమనం కలిగించడానికి, ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) కు వారి తప్పనిసరి సహకారాన్ని (ప్రాథమిక వేతనం, డీఏ) మూడు నెలల వరకు 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. ఒకవేళ మీరు నగదు సంక్షోభాన్ని ఎదుర్కోకపోతే, అలాగే మీ సహకారాన్ని తగ్గించకూడదనుకుంటే ఏమి చేయాలో కింద చూద్దాం.

యజమాని 2 శాతం సహకారాన్ని మీరు ఏమీ చేయలేరు, కావున మీ 2 శాతం వాటాను ఇతర సాధనాలలో పెట్టుబడిగా పెట్టవచ్చు. ఫైనాన్షియల్ ప్లానర్స్ ప్రకారం, ప్రస్తుతం స్థిరమైన ఆదాయాన్ని కలిగి, ప్రాథమిక జీతంలో 12 శాతం ప్లస్ డీఏ సహకారాన్ని కొనసాగించాలని చూస్తున్న వ్యక్తులు వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్) లేదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) లో 2 శాతం అదనపు మొత్తాన్ని అందించవచ్చు.

మూడు నెలల్లో మీ ఈపీఎఫ్ సహకారంలో మొత్తం 6 శాతం తగ్గింపు మీ మొత్తం పదవీ విరమణ కార్పస్‌లో భారీ తగ్గింపు తప్పదని గమనించండి.

ఈ తక్కువ సహకారం ఉద్యోగులను రెండు విధాలుగా ప్రభావితం చేస్తుంది. మొదటిది, సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపుకు ఈపీఎఫ్ సహకారం అర్హమైనది. దీన్ని తగ్గిస్తే, పన్ను బ్రేక్ కూడా తగ్గుతుంది. రెండవది, ఈపీఎఫ్ కార్పస్ లేదా రిటైర్మెంట్ పొదుపులు తగ్గడం.

వీపీఎఫ్ అంటే ఏమిటి?

వీపీఎఫ్ కింద, మీరు మీ ఈపీఎఫ్ సహకారం వాటాను పెంచుకోవచ్చు, కానీ మీ యజమాని 12 శాతం పరిమితిని మించకూడదు, ఇది మూడు నెలలకు 10 శాతంకి తగ్గింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) నిర్దేశించిన పరిమితికి మించి మీరు అందించే అదనపు మొత్తం వీపీఎఫ్ లోకి వెళుతుంది. వీపీఎఫ్ లో మీ ప్రాథమిక జీతం ప్లస్ డీఏ లో 100 శాతం వరకు పెట్టుబడి పెట్టడానికి మీకు అవకాశం ఉంది.

వీపీఎఫ్‌పై వడ్డీ రేటు ఈపీఎఫ్‌తో సమానంగా ఉంటుంది, దీనికి సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపులో ప్రభుత్వం ప్రకటిస్తుంది. వీపీఎఫ్‌ కూడా ఈపీఎఫ్‌ మాదిరిగా అదే పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. ఇది మినహాయింపు-మినహాయింపు-మినహాయింపు (ఈఈఈ) పన్ను నిర్మాణం పరిధిలోకి వస్తుంది. పెట్టుబడి సమయంలో మీకు పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. అలాగే వడ్డీ సముపార్జన లేదా ఉపసంహరణపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

మీరు ఉద్యోగం మార్చినప్పుడు, మీ ఈపీఎఫ్‌ ఖాతాని బదిలీ చేసినట్లే, వీపీఎఫ్‌ నిధులను కూడా బదిలీ చేయవచ్చు. రెండూ కూడా యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) తో అనుసంధానించి ఉంటాయి. అలాగే ఉపసంహరణ నియమాలు కూడా ఒకేవిధంగా ఉంటాయి.

మీరు ఏమి చేయాలి :

సాధారణంగా యజమానులు వీపీఎఫ్‌ను ఎంచుకోవడానికి ఉద్యోగులుకు ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలోనే ఒక చిన్న విండోను ఇస్తారు. ఒకవేళ ఉద్యోగి దీనిని ఎంచుకోకపోతే, వారు మిగిలిన సంవత్సరానికి వీపీఎఫ్ కు సహకారాన్ని అందించలేకపోవచ్చు. అందువలన వీపీఎఫ్ కు సహకారాన్ని అందించే విండో ఇంకా తెరిచి ఉందో లేదో హెచ్ఆర్ విభాగంతో తనిఖీ చేయాలి. ఒకవేళ విండో మూసివేసినట్లైతే, ఉద్యోగులు పీపీఎఫ్‌లో పెట్టుబడులు పెట్టవచ్చునని బసవరాజ్ తోనగట్టి సూచిస్తున్నారు. ఇది ప్రతి త్రైమాసికంలో ప్రకటించిన రేట్ల ప్రకారం ఈఈఈ పన్ను స్థితిని కూడా పొందుతుంది, అలాగే హామీ ఇచ్చిన రాబడిని అందిస్తుంది. ఒకవేళ మీరు ఇప్పటికే మీ పీపీఎఫ్‌ను ఖాళీ చేస్తే, మీ రిటైర్మెంట్ ఫండ్ కి సహకారాన్ని పెంచాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని