దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌కు మంచి స‌మ‌యం

అత్య‌వ‌స‌రాల‌కు స‌రిప‌డా డ‌బ్బు మీ వ‌ద్ద ఉంచుకొని మిగిలిన‌ది పెట్టుబ‌డులకు కేటాయించ‌డం మంచిది.....

Published : 22 Dec 2020 15:50 IST

అత్య‌వ‌స‌రాల‌కు స‌రిప‌డా డ‌బ్బు మీ వ‌ద్ద ఉంచుకొని మిగిలిన‌ది పెట్టుబ‌డులకు కేటాయించ‌డం మంచిది.

జ‌న‌వ‌రి 2020 నుంచి మార్చి 23 వ‌ర‌కు నిఫ్టీ 40 శాతం ప‌డిపోయింది. అయితే కొద్దిగా కోలుకున్న‌ప్ప‌టికీ ఈక్విటీ ఇన్వెస్టర్లు భారీ దెబ్బను ఎదుర్కొన్నారు. ఈ విధ‌మైన సంక్షోభం 2008 లో స్టాక్ మార్కెట్ల‌లో ఏర్ప‌డింది. అప్ప‌టినుంచి కోలుకొని ఇటీవ‌ల కాలంలో సెన్సెక్స్ 42000, నిఫ్టీ 12000 స్థాయికి చేరుకొని భారీగా లాభాల్లోకి చేరుకున్న‌ప్ప‌టికీ మ‌దుప‌ర్లు ఆ వైపుగా ఆలోచించ‌డంలేదు. ఇప్పుడు క‌రోనా క‌రాణంగా ఏర్ప‌డిన సంక్ష‌భంతో భారీగా న‌ష్ట‌పోయామ‌న్న ఉద్దేశంలో పెట్టుబ‌డుల‌ను వెన‌క్కి తీసుకుంటున్నారు. కానీ ఇది స‌రైన నిర్ణ‌యం కాద‌ని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.

ఇప్పుడు అత్య‌వ‌స‌రంగా డ‌బ్బు అవ‌స‌రం లేనివారు వారి సిప్‌, ఎస్‌టీపీలను య‌థావిధిగా కొనసాగించాలని ఆర్థిక స‌ల‌హాదారులు చెప్తున్నారు. ఇవి ప్రస్తుతము ఉన్న‌ మార్కెట్ దిద్దుబాటులో ఎక్కువ మ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్లను కూడబెట్టుకోవడం ద్వారా కొనుగోలు ధరను సగటున కలిగి ఉంటాయి. లంప్‌స‌మ్ ఉన్న‌వారు కూడా మార్కెట్ రిస్క్‌గా ఉన్నందున అస్థిరమైన రీతిలో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు.

మార్చి 26 నాటికి పెట్టుబ‌డుదారుల‌కు ఈపీఎఫ్ ఖాతాలు ఉంటే 75 శాతం వ‌ర‌కు విత్‌డ్రా చేసుకోవ‌చ్చ‌ని నిర్మ‌లాసీతారామ‌న్ ప్ర‌క‌టించారు. ఈక్విటీ ఫండ్ల‌ను ఉప‌సంహ‌రించుకునేందుకు బ‌దులుగా ఈ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకోవ‌డం మేల‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు ఆర్థిక నిపుణులు.ఇక ఫండ్ల ఎంపిక విష‌యానికొస్తే మ‌ల్టీ క్యాప్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌డం ఉత్త‌మం, మార్కెట్ల క‌ద‌లిక‌ల‌ను బ‌ట్టి ఇక్క‌డ మీ పెట్టుబ‌డులు మారుతుంటాయి. అయితే లార్ట్ క్యాప్ ఫండ్ల‌లో 40-70 శాతం పెట్టాల‌ని చెప్తున్నారు. ఇప్పుడు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్లు త‌గ్గుముఖం ప‌డుతున్న నేప‌థ్యంలో పెట్టుబడుదారులు మ‌ల్టీ క్యాప్ ఫండ్ల వైపు చూస్తున్నారు.

క‌రోనా వ్యాప్తితో లాక్‌డౌన్ విధించ‌డంతో స‌మీప‌కాలంలో వృద్ధి అంచ‌నాలు వేయ‌డం క‌ష్ట‌మే. అయితే దీర్ఘ‌కాలంలో ప్ర‌భుత్వ విధానాలు, త‌గిన చ‌ర్య‌ల‌తో వ్య‌వస్థ కోలుకుంటే ప‌రిస్థితి స‌ద్దుమ‌నుగుంద‌ని చెప్తున్నారు.

మిగులు ఉన్న పెట్టుబడిదారులు, రోజువారీ ఖర్చులకు, అత్యవసర పరిస్థితులకు కేటాయించిన త‌ర్వాత మిగులును స‌రైన పెట్టుబ‌డుల‌కు మ‌ళ్లించి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మీ ఆర్థిక లక్ష్యాల దృష్ట్యా పెట్టుబ‌డుల‌ కేటాయింపులను సమీక్షించడానికి, తదనుగుణంగా దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి ఇది మంచి సమయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని