నలభైలలో ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండాలి?
నలభైలలో ఎలాంటి ప్రణాళికలు ఎంచుకుంటే భవిష్యత్తులో ఆర్థిక జీవనం ఇబ్బంది లేకుండా ఉంటుందో చూద్దాం.............
నలభైలలో ఎలాంటి ప్రణాళికలు ఎంచుకుంటే భవిష్యత్తులో ఆర్థిక జీవనం ఇబ్బంది లేకుండా ఉంటుందో చూద్దాం.
22 అక్టోబర్ 2019 మధ్యాహ్నం 3:30
మీ ఉద్యోగ జీవితం లేదా వ్యాపార జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఆర్థిక ప్రణాళికపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. మీరు జీవితంలో అనుకున్న ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాలంటే ఒక ప్రణాళికతో పెట్టుబడులు చేయడం అవసరం. అవసరానికి తగినట్లుగా డబ్బు మీ చేతికందే విధంగా పెట్టుబడులు చేస్తే ఇక ఆర్థిక జీవితంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. నలభై ఏళ్ల వయస్సు నాటికి మీ ఉద్యోగ జీవితం ప్రారంభించి 10-15 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు మీ ఆర్థిక బాధ్యతలూ పెరుగుతాయి. పిల్లల ఉన్నత చదువులు, పెళ్లి, సొంత ఇళ్లు, పదవీ విరమణ వంటి వాటి కోసం పెట్టుబడులు చేయడానికి ఇది సరైన సమయం. ఈ వయస్సులో తప్పుడు నిర్ణయం తీసుకుంటే మీతో పాటు మీ కుటంబంపైన కూడా ఈ ప్రభావం ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి.
నలభైలలో ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండాలో చూద్దాం…
1.పిల్లల ఉన్నత చదువుల కోసం:
నలభై ఏళ్ల వయస్సులోకి అడుగుపెట్టినప్పుడు పిల్లలు కూడా ఉన్నత చదువులు చదివే వయస్సును కలిగి ఉంటారు. దేశంలో ఉన్నత చదువులకు ఎంత ఖర్చవుతుందో చెప్పనవసరం లేదు. దీంతో విద్యారుణాలు తీసుకోవడం కూడా తప్పనిసరి అయింది. మీరు విద్యారుణం తీసుకుంటే అది మీ పిల్లలపై భారమవుతుంది. మీ పిల్లల ఉన్నత చదువుకు ఇంకా 5 సంవత్సరాలు ఉండగానే దానికోసం సరైన ప్రణాళికతో అధిక రాబడినిచ్చే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు చేయడం మంచిది. నష్టభయం కలిగినవారు బ్యాలెన్స్డ్ ఫండ్లలో మదుపు చేసుకోవాలి.
- అత్యవసర నిధి:
కొన్ని సార్లు అత్యవసరంగా మీకు నగదు అవసరమైనప్పుడు మిమ్మల్ని మీరు ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడుకునేందుకు అత్యవసర నిధిని ఏర్పరచుకోవాలి. ఉద్యోగం పోయినా, ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినా ఆ సమస్యలు ఎదుర్కునేందుకు ఇవి పనికొస్తాయి. అత్యవసర నిధి కనీసం 3 నుంచి 6 నెలల ఖర్చులకు సరిపోయేంతగా ఉండాలి. మీ వయస్సు పెరిగే కొద్దీ బాధ్యతలతో పాటు ఖర్చులూ పెరుగుతాయి. అత్యవసర నిధి అనేది మీ ఖర్చులకు తగినట్లుగా ఉంచుకోవాలి. లేదంటే ఏదైనా అత్యవసరం వస్తే వేరే గత్యంతరం లేక అధిక వడ్డీతో కూడిన రుణం తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి సమయానికి అది కూడా లభించక ఇబ్బంది పడే అవకాశముంది. కాబట్టి మీ ఖర్చులకు తగినట్లుగా కొంత అత్యవసర నిధిని బ్యాంకు పొదుపు ఖాతాలలో ఉంచుకోవాలి. దీంతో మీకు వడ్డీ కూడా లభిస్తుంది.
3.సరైన బీమా పథకాన్ని ఎంచుకోండి:
జీవిత బీమా, ఆరోగ్య బీమా పథకాలు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసాను కల్పించేందుకు తోడ్పడతాయి. అయితే ఇందులో కూడా సరైన పాలసీని తీసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆదాయానికి 10-12 రెట్లు ఉండేలా జీవిత బీమా కవర్‌ను ఎంచుకోవాలి. మీ ఆర్థిక జీవితం ప్రారంభంలో అప్పటి పరిస్థితులకు తగినట్లుగా పాలసీలను ఎంచుకున్నట్లయితే, ప్రస్తుత మీ ఆదాయానికి తగినట్లుగా అవి సరైనవా, కాదా అని సమీక్షించుకోవాలి. అదేవిధంగా మీ సంస్థలో ఇచ్చే ఆరోగ్య బీమా పాలసీపై ఆధారపడి వేరే పాలసీ తీసుకోకుండా ఉండటం మంచిదికాదు. కుటుంబం అందరికీ వర్తించేలా ఫ్యామిలీ ఫ్లోటెడ్ బీమా కవర్‌ను ఎంచుకోవడం మంచిది. కొన్ని టాప్-అప్ మెడికల్ పాలసీలు సాధారణం కంటే తక్కువ ప్రీమియంలతో కూడా అందుబాటులో ఉంటాయి. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసరానికి ఇవి ఉపయోగపడతాయి. ఇక్కడ మరొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే టర్మ్ లేదా ఆరోగ్య బీమా పాలసీలు రెండింటికీ సెక్షన్ 80, 80 డీ కింద పన్ను మినహాయింపులు ఉంటాయన్న విషయం గుర్తుంచుకోవాలి.
- పదవీ విరణ ప్రణాళిక:
మీరు నలభైలో అడుగుపెట్టినప్పుడు పదవీ విరమణ ఇంకెంతో కాలం లేదన్న విషయం గుర్తొస్తుంది. పదవీ విరమణ తర్వాత మీ ఆదాయం ఆగిపోతుంది. కాబట్టి మీరు పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తగిన ఆర్థిక ప్రణాళికలను ఎంచుకోవాలి. ఇప్పటిలాగానే అప్పుడు కూడా సాఫిగా జీవనం కొనసాగాలంటే నలభైలలో సరైన ప్రణాళిక ఎంచుకోవాలి. పదవీ విరమణ తర్వాత నిధుల కోసం ప్రణాళిక చేసుకునేటప్పడు ద్రవ్యోల్బణాన్ని దృష్ఠిలో పెట్టుకోవాలి. భవిష్యత్తులో ద్రవ్యోల్బణం పెరిగితే మీరు కూడబెట్టుకున్నది దేనికీ సరిపోదు. ఇంకా రిటైర్మెంట్ 15-20 ఏళ్లు ఉండగా, ఈక్విటీలలో పెట్టుబడులు పెడితే మంచి రాబడి ఇస్తుంది. అయితే నష్ట భయం కలిగినవారు బ్యాలెన్స్డ్ ఫండ్లలో పెట్టడం మంచిది.
5.పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో:
నలభైలలో చాలామంది రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడరు. అయితే రిస్క్ లేని వాటిలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ సమయంలో ఎక్కువగా మొగ్గుచూపుతారు. అయితే ఇవి మీరు అనుకున్నఆర్థిక లక్ష్యాలకు చేరుకునేందుకు అంత దోహదం చేయకపోవచ్చు. అయితే మీ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో 50-60 శాతం ఈక్విటీలకు కేటాయించడం మంచిది. ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడులకు కొంత రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకాలిక లక్ష్యాలైన పదవీ విరమణ, పిల్లల పెళ్లి వంటి వాటి కోసం ఈ పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు ఇదివరకే అత్యవసర నిధి, స్వల్పకాలిక లక్ష్యాల కొరకు మదుపును చేస్తున్నట్టయితే, పీపీఎఫ్, జాతీయ పింఛను పథకం (ఎన్ఎస్సీ) వంటి వాటితో పోలిస్తే ఈక్విటీలలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
కేసీఆర్‌ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్‌రైజర్స్‌కు భలే దొరికాడు