వాహన బీమా తీసుకుంటున్నారా.. జాగ్రత్త!

వాహన బీమా తీసుకుంటున్నారా..? అయితే, నకిలీ సంస్థలు, వెబ్‌సైట్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని ‘భారత బీమా నియంత్రణ, ప్రాధికార సంస్థ(ఐఆర్‌డీఏఐ)’ హెచ్చరిస్తోంది. ఇటీవల ప్రజల్ని మోసం చేస్తున్న ఓ........

Published : 12 Feb 2021 22:06 IST

ఆ సంస్థ నకిలీదని ఐఆర్‌డీఏఐ హెచ్చరిక

ముంబయి: వాహన బీమా తీసుకుంటున్నారా..? అయితే, నకిలీ సంస్థలు, వెబ్‌సైట్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని ‘భారత బీమా నియంత్రణ, ప్రాధికార సంస్థ(ఐఆర్‌డీఏఐ)’ హెచ్చరిస్తోంది. ఇటీవల ప్రజల్ని మోసం చేస్తున్న ఓ సంస్థ పేరును వెల్లడించింది. దీని నుంచి ఎవరూ వాహన బీమా పాలసీని కొనుగోలు చేయొద్దని స్పష్టం చేసింది.

‘డిజిటల్‌ నేషనల్‌ మోటార్‌ ఇన్సూరెన్స్‌’ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఓ సంస్థ వాహనదారులకు అక్రమంగా బీమా పాలసీలు విక్రయిస్తోందని ఐఆర్‌డీఏఐ తెలిపింది. దీనికి ఎటువంటి లైసెన్స్‌ లేదని.. ఈ సంస్థ ఐఆర్‌డీఏఐ వద్ద నమోదు కూడా కాలేదని స్పష్టం చేసింది. ఇలాంటి నకిలీ సంస్థల నుంచి జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించింది. అలాగే ఇటీవల వాహన బీమా పేరిట నకిలీ ఫోన్‌కాల్స్‌ కూడా పెరిగిపోయాయని తెలిపింది. పూర్తి అవగాహన, కచ్చితమైన సమాచారం లేకుండా వాహన బీమా తీసుకోవద్దని కోరింది. ఈ మేరకు ఐఆర్‌డీఏఐ పలు అవగాహనా కార్యక్రమాలను రూపొందించింది. ‘బీమాబెమిసాల్‌’ ప్రారంభించిన కార్యక్రమంలో బీమా ఎలా పొందాలి.. సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలనే విషయాలపై స్పష్టమైన అవగాహన కల్పించింది.

ఇవీ చదవండి...

ఎస్‌బీఐ కొత్త గృహ రుణ వ‌డ్డీ రేట్లు ఎంతో తెలుసా ?

విమాన ప్రయాణం మరింత భారం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు