Tax Evasion: రూ.9358 కోట్ల పన్ను ఎగవేత.. నోటీసులు పంపారంతే!

పన్ను ఎగవేతదారులకు నోటీసులు పంపుతన్న జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ తిరిగి వారి నుంచి ఎలాంటి సమాచారం అందిందనే దానిపై ఎలాంటి సమాచారాన్ని భద్రపరచడం లేదు....

Updated : 08 Jan 2022 14:24 IST

నాగ్‌పూర్‌: పన్ను ఎగవేతదారులకు నోటీసులు పంపుతన్న జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ తిరిగి వారి నుంచి ఎలాంటి స్పందన అందిందనే దానిపై ఎలాంటి సమాచారాన్ని భద్రపరచడం లేదు. నాగ్‌పూర్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అభయ్‌ కోలార్కర్‌ కోరిన సమాచారం మేరకు జీఎస్టీ అధికారుల ఇచ్చిన సమాధానం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. షోకాజ్‌ నోటీసులైతే పంపారు కానీ, తర్వాత ఆ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారన్నది మాత్రం ఎక్కడా రికార్డు చేయకపోవడం గమనార్హం. 

2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2020-21 మధ్య మొత్తం 158 షోకాజ్ నోటీసులు పంపారు. దాదాపు రూ.9,358 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించి ఈ నోటీసులను జారీ చేశారు. వాటికి తిరిగి అందిన సమాధానాలు, ఇంకా ఎన్నింటికి స్పందన రావాల్సి ఉంది వంటి వివరాలేవీ ఆర్‌టీఐ సమాధానంలో పొందుపరచలేదు. ఒకవేళ ఎవరైనా నోటీసులకు స్పందించి బకాయిలు చెల్లించి ఉంటే.. ఆ వివరాలు కూడా అందులో లేకపోవడం గమనార్హం. నోటీసులకు సంబంధించిన ప్రతి విషయాన్నీ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ) రికార్డు చేయాలని కోలార్కర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని