ట్రంప్ నిర్ణయం వాపస్.. బెజోస్‌కు కనకవర్షం..!
అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో కుదిరిన ఓ డీల్‌ను ప్రస్తుత బైడెన్ ప్రభుత్వం రద్దు చేసింది. రెండేళ్ల క్రితం టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌కు ఇచ్చిన క్లౌడ్
ఒక్కరోజే రూ.62వేల కోట్లు పెరిగిన సంపద
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో కుదిరిన ఓ డీల్‌ను ప్రస్తుత బైడెన్ ప్రభుత్వం రద్దు చేసింది. రెండేళ్ల క్రితం టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌కు ఇచ్చిన క్లౌడ్ కంప్యూటింగ్ కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తున్నట్లు అమెరికా రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్ ప్రకటించింది. దీంతో అపరకుబేరుడు, అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్‌కు కనకవర్షం కురిసింది. ఒక్కరోజే ఆయన నికర సంపద రూ.62వేల కోట్లకు పైనే పెరిగింది.
క్లౌడ్ కంప్యూటింగ్ కోసం అమెరికా రక్షణశాఖ.. 2019లో మైక్రోసాఫ్ట్‌తో 10 బిలియన్ డాలర్లతో ఒప్పందం చేసుకుంది. అయితే ఈ డీల్‌పై గత కొంతకాలంగా ప్రభుత్వం, టెక్ దిగ్గజాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ట్రంప్ జోక్యంతోనే ఆ డీల్ మైక్రోసాఫ్ట్‌కు చేరిందంటూ అమెజాన్ ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారం కోర్టుకు కూడా చేరింది. అమెజాన్ ఆరోపణలను కోర్టు కొట్టివేయకపోతే మైక్రోసాఫ్ట్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని ఈ ఏడాది ఆరంభంలోనే పెంటగాన్ తెలిపింది. అమెజాన్ పిటిషన్‌ను కొట్టివేయాలంటూ మైక్రోసాఫ్ట్ చేసిన అభ్యర్థనను ఫెడరల్ కోర్టు తిరస్కరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో మైక్రోసాప్ట్‌తో చేసుకున్న డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్లు పెంటగాన్ తాజాగా ప్రకటించింది. ఎక్కువమంది వెండర్లతో కలిసి కొత్త ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నామని తెలిపింది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ రెండింటితో కలిసి రక్షణశాఖ ఈ డీల్ చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.
పెంటగాన్ తాజా ప్రకటనతో మంగళవారం నాటి ట్రేడ్ సెషన్లో అమెజాన్ షేర్లు 4.7శాతం పెరిగాయి. దీంతో జెఫ్ బెజోస్ నికర సంపద 8.4 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.62వేల కోట్లకు పైమాటే) పెరిగి మొత్తం సంపద 211 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ సూచీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇంత భారీ మొత్తం సంపద కలిగిన ఏకైక వ్యక్తి బెజోసే కావడం విశేషం.
అంతకుముందు ఈ ఏడాది జనవరిలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నికర సంపద 210 బిలియన్ డాలర్లను తాకింది. అప్పుడు ఆయన బెజోస్‌ను దాటి ప్రపంచ కుబేరుడిగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే ఆ తర్వాత ఆయన సంపద భారీగా పడిపోయింది. దీంతో బెజోస్ మళ్లీ నెంబర్ 1 స్థానంలో వచ్చి అక్కడే స్థిరంగా ఉంటున్నారు. ప్రస్తుతం 180.8 బిలియన్ డాలర్ల సంపదతో మస్క్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!