Jio Fiber : 3 నెలల కాలపరిమితితో జియో ఫైబర్‌ కొత్త ప్లాన్లు!

జియో ఫైబర్‌ తన బ్రాడ్‌బ్యాండ్‌ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. ఇప్పటి వరకు 6, 12 నెలల కాలపరిమితితో కూడిన పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లను అందించిన జియో ఇప్పుడు మూడు నెలల వ్యవధితో కూడిన పథకాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది....

Updated : 09 Dec 2021 17:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జియో ఫైబర్‌ తన బ్రాడ్‌బ్యాండ్‌ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. ఇప్పటి వరకు 6, 12 నెలల కాలపరిమితితో కూడిన పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లను అందించిన జియో ఇప్పుడు మూడు నెలల వ్యవధితో కూడిన పథకాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ప్లాన్లు తీసుకునే పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లు కూడా ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్‌, ఇన్‌స్టాలేషన్‌ చార్జీలు చెల్లించనక్కర్లేదని జియో తెలిపింది.

కొత్తగా తీసుకొచ్చిన ప్లాన్లు రూ.2,097 దగ్గర ప్రారంభమై గరిష్ఠంగా రూ.25,597 వరకు ఉన్నాయి. అయితే, బేసిక్‌ ప్లాన్‌లో ఎలాంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉండవు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్కవరీ ప్లస్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలైవ్‌, జీ5 వంటి ఓటీటీ సేవలు రూ.2,997 ప్లాన్‌తో ప్రారంభమయ్యాయి.

ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి..

* రూ.2,097 ప్లాన్‌లో-  ప్రయోజనాలు: 100 ఎంబీపీఎస్‌ వేగంతో అపరిమిత డేటా, ఉచిత వాయిస్‌కాల్స్‌; ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు - ఏమీ లేదు

* రూ.2,997 ప్లాన్‌లో- ప్రయోజనాలు: 150 ఎంబీపీఎస్‌ వేగంతో అపరిమిత డేటా,ఉచిత వాయిస్‌ కాల్స్‌; ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు - ఆల్ట్‌ బాలాజీ, అమెజాన్‌ప్రైమ్‌ వీడియో, డిస్కవరీ+, డిస్నీ+హాట్‌స్టార్‌, ఎరోస్‌ నౌ, హొయ్‌చొయ్‌, జియో సావన్‌, జియో సినిమా, లయన్స్‌ గేట్‌ ప్లే, షెమారూమీ, సోనీ లివ్‌‌, సన్‌ నెక్ట్స్‌, వూట్‌ కిడ్స్‌, వూట్‌ సెలెక్ట్‌, జీ 5

* రూ.4,497 ప్లాన్‌లో-  ప్రయోజనాలు: 300 ఎంబీపీఎస్‌ వేగంతో అపరిమిత డేటా, ఉచిత వాయిస్‌ కాల్స్‌; ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు - ఆల్ట్‌ బాలాజీ, అమెజాన్‌ప్రైమ్‌ వీడియో, డిస్కవరీ+, డిస్నీ+హాట్‌స్టార్‌, ఎరోస్‌ నౌ, హొయ్‌చొయ్‌, జియో సావన్‌, జియో సినిమా, లయన్స్‌ గేట్‌ ప్లే, నెట్‌ఫ్లిక్స్‌(బేసిక్‌), షెమారూమీ, సోనీ లివ్‌‌, సన్‌ నెక్ట్స్‌, వూట్‌ కిడ్స్‌, వూట్‌ సెలెక్ట్‌, జీ 5

* రూ.7,497 ప్లాన్‌లో-  ప్రయోజనాలు: 500 ఎంబీపీఎస్‌ వేగంతో అపరిమిత డేటా, ఉచిత వాయిస్‌ కాల్స్‌; ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు - ఆల్ట్‌ బాలాజీ, అమెజాన్‌ప్రైమ్‌ వీడియో, డిస్కవరీ+, డిస్నీ+హాట్‌స్టార్‌, ఎరోస్‌ నౌ, హొయ్‌చొయ్‌, జియో సావన్‌, జియో సినిమా, లయన్స్‌ గేట్‌ ప్లే, నెట్‌ఫ్లిక్స్‌(బేసిక్‌), షెమారూమీ, సోనీ లివ్‌‌, సన్‌ నెక్ట్స్‌, వూట్‌ కిడ్స్‌, వూట్‌ సెలెక్ట్‌, జీ 5

* రూ.11,997 ప్లాన్‌లో-  ప్రయోజనాలు: 1జీబీపీఎస్‌ వేగంతో అపరిమిత డేటా, ఉచిత వాయిస్‌ కాల్స్‌; ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు - ఆల్ట్‌ బాలాజీ, అమెజాన్‌ప్రైమ్‌ వీడియో, డిస్కవరీ+, డిస్నీ+హాట్‌స్టార్‌, ఎరోస్‌ నౌ, హొయ్‌చొయ్‌, జియో సావన్‌, జియో సినిమా, లయన్స్‌ గేట్‌ ప్లే, నెట్‌ఫ్లిక్స్‌(బేసిక్‌), షెమారూమీ, సోనీ లివ్‌‌, సన్‌ నెక్ట్స్‌, వూట్‌ కిడ్స్‌, వూట్‌ సెలెక్ట్‌, జీ 5

* రూ.25,497 ప్లాన్‌లో-  ప్రయోజనాలు: 1జీబీపీఎస్‌ వేగంతో నెలకు 6,600 జీబీ డేటా, ఉచిత వాయిస్‌ కాల్స్‌; ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు - ఆల్ట్‌ బాలాజీ, అమెజాన్‌ప్రైమ్‌ వీడియో, డిస్కవరీ+, డిస్నీ+హాట్‌స్టార్‌, ఎరోస్‌ నౌ, హొయ్‌చొయ్‌, జియో సావన్‌, జియో సినిమా, లయన్స్‌ గేట్‌ ప్లే, నెట్‌ఫ్లిక్స్‌(బేసిక్‌), షెమారూమీ, సోనీ లివ్‌‌, సన్‌ నెక్ట్స్‌, వూట్‌ కిడ్స్‌, వూట్‌ సెలెక్ట్‌, జీ 5

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని