Jio Cashback: జియో రీఛార్జీతో క్యాష్‌బ్యాక్‌.. ఏ ప్లాన్‌లలో వస్తుందంటే?

పండగ సీజన్‌ నేపథ్యంలో జియో సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది...

Updated : 29 Sep 2021 15:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పండగ సీజన్‌ నేపథ్యంలో జియో సరికొత్త రీఛార్జ్‌ ఆఫర్‌తో ముందుకొచ్చింది. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అయితే, మూడు ప్లాన్లకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. రూ.249, రూ.555, రూ.599 ప్లాన్‌లపై 20% క్యాష్‌బ్యాక్ వస్తుంది. మై జియో యాప్ లేదా జియో అధికారిక వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్‌ చేసిన వారికి మాత్రమే ఈ ప్రయోజనం అందనుంది. రీఛార్జ్‌ అనంతరం జియో ఖాతాలో క్యాష్‌బ్యాక్‌ జమ అవుతుంది. దీనిని భవిష్యత్తులో రీఛార్జ్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు.

రూ.249 ప్లాన్ : రోజువారీ 2GB డేటా; అపరిమిత వాయిస్ కాలింగ్; రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు; కాలపరిమితి 28 రోజులు; జియో యాప్‌లకు ఉచిత యాక్సెస్‌.

రూ.555 ప్లాన్: రోజువారీ 1.5GB డేటా; అపరిమిత వాయిస్ కాలింగ్; ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు; కాలపరిమితి 84 రోజులు; అన్ని జియో యాప్‌లకు ఉచిత యాక్సెస్‌.

రూ.599 ప్లాన్: రోజువారీ 2GB డేటా; అపరిమిత వాయిస్ కాలింగ్; ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు; కాలపరిమితి 84 రోజులు; అన్ని జియో యాప్‌లకు ఉచిత యాక్సెస్‌.

క్యాష్‌బ్యాక్ పొందండిలా..

* మైజియో యాప్ లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

* 20% క్యాష్‌బ్యాక్‌ రీఛార్జి సెక్షన్‌పై క్లిక్‌ చేయండి.

* రూ.249, రూ.555 లేదా రూ.599 నుంచి ఏదైనా ఒక ప్లాన్‌ను ఎంచుకోండి.

* ప్లాన్ సొమ్ము చెల్లించండి.

20% లేదా గరిష్ఠంగా 200 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. వచ్చిన క్యాష్‌బ్యాక్ సొమ్మును వినియోగదారులు అక్టోబర్ 2 నుంచి జియో మార్ట్‌, స్మార్ట్‌ పాయింట్‌, రిలయన్స్‌ ఫ్రెష్‌ సిగ్నేచర్‌, మిల్క్‌బాస్కెట్‌, ట్రెండ్స్‌, రియలన్స్ డిజిటల్‌, నెట్‌మెడ్స్‌, జియో రీఛార్జ్‌, అజియోలో ఎక్కడైనా రీడీమ్ చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని