Jio - Disney plus Hotstar:  డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో జియో కొత్త ప్లాన్లు! 

డిస్నీ+ హాట్‌స్టార్‌ కంటెంట్‌కు యాక్సెస్‌తో కూడిన కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను జియో విడుదల చేసింది. 

Updated : 09 Dec 2021 17:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డిస్నీ+ హాట్‌స్టార్‌ కంటెంట్‌ సబ్‌స్క్రిప్షన్లతో కూడిన కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను జియో విడుదల చేసింది. త్వరలో ప్రారంభం కాబోయే ఐపీఎల్‌ సీజన్‌కు ముందు వీటిని తీసుకురావడం గమనార్హం. ఇవి సెప్టెంబరు 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే డిస్నీ+ హాట్‌స్టార్‌కు పాత ప్లాన్లతో సబ్‌స్క్రైబ్‌ అయిన వారికి ఆయా ప్లాన్ల ప్రయోజనాలు కాలపరిమితి ముగిసే వరకు అందనున్నాయి. డిస్నీ+ హాట్‌స్టార్‌ ధరలను పెంచిన నేపథ్యంలోనే జియో కూడా ప్లాన్ల ఖరీదును సవరించింది. ఈ కొత్త ప్లాన్లతో డిస్నీ+ హాట్‌స్టార్‌ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అపరిమిత వాయిస్‌, డేటా, ఎస్‌ఎంఎస్‌, జియో యాప్స్‌ వంటి ప్రయోజనాలు అందనున్నాయి. అలాగే డిస్నీ+ ఒరిజినల్స్‌, డిస్నీ టీవీ షోలు, మార్వెల్‌, స్టార్‌ వార్స్‌, నేషనల్‌ జియోగ్రాఫిక్‌, హెచ్‌బీఓ, ఎఫ్‌ఎక్స్‌, షోటైం వంటి ఇంటర్నేషనల్‌ కంటెంట్‌నూ వీక్షించవచ్చు.

* 28 రోజుల కాలపరిమితి కలిగిన ₹ 499 ప్లాన్‌ కింద డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ప్రతిరోజు 3 జీబీ డేటా లభిస్తుంది. ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, వాయిల్‌ కాల్స్‌ కూడా ఉంటాయి.

* 56 రోజుల వ్యాలిడిటీ కలిగిన ₹666 మరో ప్లాన్‌లో డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ప్రతిరోజు 2 జీబీ డేటా లభిస్తుంది. ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, వాయిల్‌ కాల్స్‌ యథావిధిగా ఉంటాయి.

* ₹ 888 ప్లాన్‌లో డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌, 84 రోజుల వ్యాలిడిటీ, డైలీ 2 జీబీ డేటా, ఉచిత కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఇవే ప్రయోజనాలతో ఏడాది కాలపరిమితి కలిగిన ప్లాన్‌ కూడా ఉంది. దీని ధర ₹ 2,599.

* వీటితో పాటు ఓ యాడ్‌ఆన్‌ ప్లాన్‌ని కూడా ప్రవేశపెట్టారు. ₹ 549లతో 56 రోజుల వ్యాలిడిటీ, డైలీ 1.5 జీబీ డేటా లభిస్తుంది. అయితే, ఎలాంటి ఉచిత కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు లభించవు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని