Jio: వాట్సాప్‌లో టీకా సమాచారం 

ప్రముఖ టెలికాం ఆపరేటర్‌ రిలయన్స్‌ జియో మరో అద్భుతమైన ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్‌ చాట్‌బాట్‌ ద్వారా యూజర్లకు కరోనా టీకాలకు సంబంధించిన

Published : 09 Jun 2021 17:37 IST

దిల్లీ: ప్రముఖ టెలికాం ఆపరేటర్‌ రిలయన్స్‌ జియో మరో అద్భుతమైన ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్‌ చాట్‌బాట్‌ ద్వారా యూజర్లకు కరోనా టీకాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తోంది. దీంతో పాటు రీఛార్జ్‌, పేమెంట్లు వంటి ఇతర కస్టమర్‌ సర్వీసులను కూడా ఈ చాట్‌బాట్‌ ద్వారా అందిస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 

‘‘జియో యూజర్లు ఇకపై ఫోన్‌ రీఛార్జ్‌లు, చెల్లింపులు, మొబైల్‌ పోర్టబిలిటీ, ఇంటర్నేషనల్‌ రోమింగ్‌, జియోమార్ట్‌ వంటి సేవలను వాట్సాప్‌ ద్వారా పొందవచ్చు. దీంతో పాటు కొవిడ్‌ వ్యాక్సిన్‌, టీకా లభ్యతకు సంబంధించిన సమాచారం కూడా వాట్సాప్‌లో తెలుసుకోవచ్చు’’ అని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం యూజర్లు జియో కేర్‌ నంబర్‌ను +91 70007 70007ను వాట్సాప్‌లో సేవ్‌ చేసుకుని దానికి Hi అని మెసేజ్‌ పంపాలి. అప్పుడే ఈ చాట్‌బాట్‌ సేవలు అందుబాటులోకి వస్తాయని కంపెనీ తెలిపింది. 

హాయ్‌ అని పంపించిన తర్వాత యూజర్లకు సేవల మెనూ కన్పిస్తోంది. అందులో కొవిడ్‌ వ్యాక్సిన్‌ సమాచారం, జియో సిమ్‌ రీఛార్జ్‌, పోర్టబిలిటీ వంటి తదితర ఆప్షన్లు ఉన్నాయి. మనం ఏది ఎంపిక చేసుకుంటే దానికి సంబంధించిన వివరాలను పంపిస్తుంది. పిన్‌కోడ్‌ ఎంటర్‌ చేస్తే టీకా కేంద్రాల సమాచారం వస్తుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని