
Jio Phone Next: చౌక స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ నెక్ట్స్.. విడుదల ఇప్పుడే కాదు
దీపావళికి తీసుకొస్తామన్న రిలయన్స్ జియో, గూగుల్
దిల్లీ: వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘జియో ఫోన్ నెక్ట్స్’ రాక మరింత ఆలస్యం కానుంది. నిజానికి ఈ స్మార్ట్‌ఫోన్‌ను వినాయక చవితిని పురస్కరించుకుని నేటి నుంచి మార్కెట్లోకి తీసుకొస్తామని గతంలో రిలయన్స్ జియో ప్రకటించింది. అయితే ఇప్పుడు దాన్ని వాయిదా వేశారు. దీపావళి పండగ సీజన్ నాటికి ఫోన్‌ను అందుబాటులోకి తెస్తామని కంపెనీ శుక్రవారం రాత్రి వెల్లడించింది.
రిలయన్స్ - గూగుల్ భాగస్వామ్యంతో అత్యంత చౌకైన ‘జియో ఫోన్ నెక్స్ట్’ను అభివృద్ధి చేసినట్లు రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫోన్‌ను సెప్టెంబరు 10న విడుదల చేయనున్నట్లు అప్పట్లో ఆయన వెల్లడించారు. అయితే వినియోగదారుల మెప్పు పొందేలా ఈ ఫోన్‌ను మెరుగ్గా అభివృద్ధి చేసేందుకు మరింత సమయం తీసుకుంటున్నట్లు తెలిసింది. ‘‘ఫోన్లో మరిన్ని ఫీచర్లు తీసుకొచ్చేందుకు కొంతమంది పరిమిత యూజర్లతో జియోఫోన్ నెక్స్ట్ టెస్టింగ్‌ను రిలయన్స్ జియో, గూగుల్ ప్రారంభించాయి. దీపావళి పండగ సీజన్ నాటికి ఈ ఫోన్‌ను మార్కెట్లో విస్తృతంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. అప్పటికి పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న సెమీకండక్టర్ల కొరత కూడా తీరుతుందని భావిస్తున్నాం’’ అని రెండు కంపెనీలు నిన్న సంయుక్త ప్రకటన విడుదల చేసినట్లు పీటీఐ కథనం పేర్కొంది.
అందుబాటు ధరలో 4జీ కనెక్టివిటీతో స్మార్ట్‌ఫోన్ కావాలనుకునేవారి కోసం జియోఫోన్ నెక్స్ట్ను రూపొందించినట్లు రిలయన్స్ జియో గతంలో వెల్లడించింది. జియో కోసం గూగుల్ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఆప్టిమైజ్డ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇది పనిచేస్తుంది. ఇది పూర్తిస్థాయి స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్లో.. వాయిస్ అసిస్టెంట్, ఆటోమెటిక్ రీడ్-అలౌడ్ ఆఫ్ స్క్రీన్ టెక్స్ట్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, రియాల్టీ ఫిల్టర్స్‌తో స్మార్ట్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ధరను కంపెనీ ఇంకా నిర్ణయించలేదు. అయితే ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తుందని ముకేశ్ అంబానీ వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Khairatabad Ganesh: ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడి రూపమిదే!
-
Movies News
Samantha: సల్మాన్ వీడియోపై సామ్ ‘లవ్’ రిప్లై
-
Business News
ITR filing: ట్యాక్స్ ఫైలింగ్‌కి సిద్ధమయ్యారా? ఈ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి..
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Hyderabad: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
-
Sports News
Ruturaj Gaikwad: ఐర్లాండ్‌తో తొలి పోరులో రుతురాజ్ ఎందుకు ఆడలేదంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- చెరువు చేనైంది