Debit Card: టీనేజ‌ర్ల‌కు రూపే ఫ్లాట్‌ఫామ్ ద్వారా డెబిట్‌ కార్డును అందిస్తున్న ఫిన్‌టెక్‌ 

ఈ కార్డుల‌ను ఆన్‌లైన్ ద్వారా తీసుకోవ‌చ్చు. సున్నా వార్షిక రుసుముతో ల‌భిస్తున్నాయి. 

Updated : 12 Nov 2021 18:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫిన్‌టెక్ స్టార్ట‌ప్ సంస్థ‌ జూనియో స్మార్ట్‌ మ‌ల్టీ పర్పస్ కార్డును ప్ర‌వేశ‌పెట్టింది. జూనియో కార్డ్ ప్ర‌త్యేకించి టీనేజ‌ర్లు, ప్రీ టీనేజ‌ర్ల కోసం డిజైన్ చేసిన‌ డెబిట్ కార్డ్‌. సుర‌క్షితంగా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ చెల్లింపులు చేసేందుకు అనుమ‌తిస్తుంది. కొవిడ్ త‌ర్వాత మునెపెన్న‌డూ లేని విధంగా డిజిటిల్ చెల్లింపులకు ప్రాధాన్య‌త పెరిగింది. దీంతో జూనియో యాప్‌/కార్డ్ తీసుకునే పిల్ల‌లు, త‌ల్లిదండ్రుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది. కొత్త‌గా ప్రారంభించిన రూపే ఆధారిత జూనియో స్మార్ట్‌తో యువ‌త ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ చెల్లింపుల‌ను సుల‌భంగా చేయ‌వ‌చ్చు. రూపే ఫ్లాట్‌ఫాం నుంచి కార్డును తీసుకురావ‌డం వ‌ల్ల‌ మ‌ర్చెంట్ నెట్‌వ‌ర్క్‌లోనూ కార్డుకు ఆమోదం పెరిగింది. 

పిల్ల‌లు వారి త‌ల్లిదండ్రులు జూనియో యాప్‌కి సైన్‌-అప్ చేసి సున్నా వార్షిక ఛార్జీల‌తో ఆన్‌లైన్ ద్వారా వ‌ర్చువ‌ల్‌గా జూనియో స్మార్ట్ కార్డును పొందొచ్చు. కార్డును ఉప‌యోగించి పిల్లలు చేసే జూనియో చెల్లింపుల‌పై అద‌నంగా 7 శాతం (గ‌రిష్ఠంగా) క్యాష్‌బ్యాక్ పొంద‌డంతో పాటు ఇత‌ర రివార్డు ప్ర‌యోజ‌నాల‌ను పొందే అవ‌కాశం ఉంది. ఈ కార్డు త‌ల్లిదండ్రుల ఆధ్వ‌ర్యంలో ప‌నిచేస్తుంది కాబ‌ట్టి యుక్త వ‌య‌సు పిల్ల‌ల‌కు వారి జీవిత ప్రారంభ‌ద‌శ‌లోనే డిజిట‌ల్ లావాదేవీలు నిర్వ‌హించేందుకు శ‌క్తినిస్తుంది. చిన్న వ‌య‌సు నుంచే పిల్ల‌లలో ఆరోగ్యక‌ర‌మైన ఆర్థిక అల‌వాట్ల‌ను పెంపొందించాలి. పిల్ల‌లు ఆర్థిక స్వ‌తంత్రులుగా ఎద‌గడంలో స‌హాయ‌ప‌డాలన్న‌దే త‌మ ఆలోచన‌గా సంస్థ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని