DHFL: ఎన్సీఎల్‌ఏటీపై సుప్రీంకు వాద్వాన్‌..!

దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ మాజీ ప్రమోటర్‌ కపిల్‌ వాద్వాన్‌  ఎన్సీఎల్‌ఏటీ ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీం కోర్టును

Published : 01 Jun 2021 22:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ మాజీ ప్రమోటర్‌ కపిల్‌ వాద్వాన్‌  ఎన్సీఎల్‌ఏటీ ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే దిగువన ఉన్న ఎన్సీఎల్టీలో ఆయన ఆఫర్‌ను బ్యాంకులు పరిశీలించాలని తీర్పురాగా.. దానిపై అప్పిలేట్‌ ట్రైబ్యూన్‌ల్‌ అయిన ఎన్సీఎల్‌ఏటీ స్టే విధించింది. 

తొలుత ఎన్సీఎల్టీ తీర్పులు రుణదాతలు, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు ఆర్‌బీఐ నియమించిన అడ్మిస్ట్రేటర్లు ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించారు. ఈ తీర్పును పరిశీలించిన ఎన్సీఎల్‌ఏటీ స్టే విధించింది. ఇటువంటి తీర్పులు ఇవ్వడానికి ఎటువంటి చట్టం లేదని పేర్కొంది. కమిటీ ఆఫ్‌ క్రెడిటార్స్‌ను వాద్వాన్‌ ఆఫర్‌ను పరిశీలించాలని సూచించలేరని వెల్లడించింది. 

డిసెంబర్‌లో వాద్వాన్‌ ఆర్‌బీఐ నియమించిన అడ్మిస్ట్రేటర్లకు ఒక లేఖ రాశారు. దీనిలో ఆయన రుణదాతల నుంచి తీసుకొన్న రూ.91,158 కోట్లను చెల్లించేందుకు అంగీకరించారు. దీనిలో రూ.9 వేల కోట్లను తొలుత చెల్లించగా.. మిగిలినది వచ్చే 7 నుంచి 8 ఏళ్లలో రుణాలను వాటాలుగా మార్చే విధానం కింద చెల్లిస్తానని తెలిపారు. దీనికి సంబంధించే ఎన్సీఎల్టీ నుంచి కేసు ఎన్సీఎల్‌ఏటీకి వచ్చింది. ఇక్కడ గత తీర్పుపై స్టే విధించడంతో వాద్వాన్‌ స్పందించేందుకు జూన్‌ 25 వరకు సమయం ఇచ్చారు. కానీ, ఆయన అంతకు ముందే నేరుగా సుప్రీంను ఆశ్రయించారు. 
 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని