Zydus Wellness-Katrina Kaif: ‘షుగర్‌ ఫ్రీ’ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్‌

జైడస్‌ వెల్‌నెస్‌ నుంచి వచ్చిన ‘లో కేలరీ స్వీటెనర్‌’ ‘షుగర్‌ ఫ్రీ’ ఉత్పత్తులకు ప్రముఖ బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనుంది....

Updated : 04 Sep 2021 15:45 IST

దిల్లీ: జైడస్‌ వెల్‌నెస్‌ తయారు చేస్తున్న ‘లో కేలరీ స్వీటెనర్‌’ ‘షుగర్‌ ఫ్రీ’ ఉత్పత్తులకు ప్రముఖ బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని శనివారం జైడస్‌ వెల్‌నెస్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ రంగంలో మార్కెట్‌ లీడర్‌గా నిలిచేందుక కత్రినా సహకారం తమకు ఉపయోగపడనుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలన్న కత్రిన తపన సంస్థ విలువలతో పోలి ఉన్నాయని గుర్తు చేసింది. ఆమెకున్న ప్రజాదరణతో.. ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్న వారికి మరింత చేరువ కావాలని ప్రయత్నిస్తున్నామంది. షుగర్‌ ఫ్రీ బ్రాండ్‌తో పాటు దాని సహ-ఉత్పత్తులకు కత్రినా అంబాసిడర్‌గా ఉంటారన్నారు.

షుగర్‌కు బదులుగా వాడే వస్తువుల మార్కెట్‌లో ‘షుగర్‌ ఫ్రీ’ ఉత్పత్తులకే 94 శాతం వాటా ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం 4.5 లక్షల ఔట్‌లెట్లలో ఈ ఉత్పత్తులు లభిస్తాయని జైడస్ వెల్‌నెస్‌ తెలిపింది. కాంప్లాన్‌, ఎవర్‌యూత్‌, నైసిల్‌, గ్లూకాన్‌-డి, షుగర్‌లైట్‌, నూట్రాలైట్‌ వంటి ఉత్పత్తులు జైడస్‌ వెల్‌నెస్‌ నుంచి వస్తున్నవే. అహ్మదాబాద్‌, ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న జైడస్‌ వెల్‌నెస్‌ వ్యాపారం 20 దేశాల్లో విస్తరించి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని