Auto Sales: చిప్‌లు రాలేదు.. వాహనాలు కదల్లేదు!

వాహన తయారీ కంపెనీలను ఎలక్ట్రానిక్‌ చిప్‌ల కొరత ఇంకా వేధిస్తూనే ఉంది. గత గత కొన్ని నెలల్లో ఈ కారణంగా భారీ స్థాయిలో విక్రయాలు పడిపోగా.. అక్టోబరులోనూ  పరిస్థితి ఏమీ మారలేదు. కీలక సంస్థల విక్రయాలు పడిపోయాయి....

Published : 01 Nov 2021 20:47 IST

అక్టోబరులోనూ క్షీణించిన వాహన విక్రయాలు

దిల్లీ: వాహన తయారీ కంపెనీలను ఎలక్ట్రానిక్‌ చిప్‌ల కొరత ఇంకా వేధిస్తూనే ఉంది. గత కొన్ని నెలలుగా ఈ కారణంగానే భారీ స్థాయిలో విక్రయాలు పడిపోయాయి. అక్టోబరులోనూ పరిస్థితి ఏమీ మారలేదు. కీలక సంస్థల విక్రయాలు పడిపోయాయి. దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ(ఎంఎస్‌ఐ) వాహన విక్రయాల్లో 24% క్షీణత కనిపించింది. గత నెలలో అమ్మకాలు 1,38,335 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2020 అక్టోబరులో ఈ కంపెనీ 1,82,448 వాహనాలు విక్రయించింది. ఎంఎస్‌ఐ దేశీయ విక్రయాలు 1,72,862 నుంచి 32 శాతం తగ్గి 1,17,013కి పరిమితమయ్యాయి. చిన్న కార్లలో ఆల్టో, ఎస్‌-ప్రెసోల విక్రయాలు 28,462 నుంచి 21,831కు పడిపోయాయి. కాంపాక్ట్‌ కార్ల విభాగంలో స్విఫ్ట్‌, సెలెరియో, ఇగ్నిస్‌, బాలెనో, డిజైర్‌ విక్రయాలు 49 శాతం తగ్గి 48,690కి తగ్గిపోయాయి. మధ్యస్థాయి సెడాన్‌ సియాజ్‌ అమ్మకాలు 25 శాతం పడిపోయాయి. వినియోగ వాహనాలైన ఎర్టిగా, ఎస్‌-క్రాస్‌, విటారా బ్రెజా, విక్రయాలు 7 శాతం పెరిగి 27,081 కు చేరాయి. అయితే, ఎగుమతులు మాత్రం రెండింతలకు పైగా పెరగడం విశేషం. గత ఏడాది ఇదే నెలలో 9,586 యూనిట్లు ఎగుమతి కాగా.. ఈసారి అవి 21,321 యూనిట్లకు పెరిగింది.

* ఇక మరో వాహన దిగ్గజం హ్యుందాయ్‌ టోకు అమ్మకాలు సైతం పడిపోయాయి. క్రితం ఏడాది అక్టోబరులో 68,835 యూనిట్లు అమ్ముడు కాగా.. ఈసారి అవి 43,556కు పరిమితమయ్యాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా విక్రయాలు 44,359 నుంచి 05 శాతం తగ్గి 41,908 యూనిట్లకు పడిపోయాయి. నిస్సాన్‌, స్కోడా ఆటో విక్రయాలు మాత్రం అక్టోబరు నెలలో పెరిగాయి.

కంపెనీ                    2021           2020         క్షీణత/(వృద్ధి)%

మారుతీ సుజుకీ           1,38,335         1,82,448         24

నిస్సాన్‌                   3,913           1,105          (35.4)

ఎంజీ మోటార్‌             2,863           3,750           24

స్కోడా ఆటో               3,065           1,421          (21.5)

హ్యుందాయ్‌              43,556          68,835          37

మహీంద్రా                 41,908          44,359          05

ట్రాక్టర్లు..

ఎస్కార్ట్స్‌                  13,514          13,664          1.1

ద్విచక్రవాహనాలు

సుజుకీ మోటార్‌సైకిల్‌      69,186           76,865          10

టీవీఎస్‌ మోటార్‌         3,55,033          3,94,724         10

వాణిజ్య వాహనాలు

వీఈసీవీ                  5,805             4,200        (38.2)

అశోక్‌ లేలాండ్‌            11,079             9,989        (11)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని