Health Insurance: సమగ్ర, సాధారణ ఆరోగ్య బీమా మధ్య తేడా ఏంటి?

సాధార‌ణ‌ బీమా కంటే స‌మ‌గ్ర ఆరోగ్య బీమాను కొనుగోలు చేయ‌డం ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది.  

Updated : 23 Nov 2021 16:51 IST

కోవిడ్ విజృంభ‌న కార‌ణంగా ఆరోగ్య బీమా ప్రాధాన్య‌త పెరిగింది. ప్ర‌తీ ఒక్క‌రూ వారి ఆర్థిక ప్ర‌ణాళిక‌లో ఆరోగ్య బీమాను భాగం చేయ‌డం అనివార్య‌మ‌య్యింది. అయితే కొనుగోలుదారులు ఎలాంటి ఆరోగ్య బీమా ఎంచుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం. బీమా కొనుగోలు చేసేముందు సాధార‌ణ, స‌మ‌గ్ర ఆరోగ్య బీమా మ‌ధ్య వ్య‌త్యాసాన్ని తెల‌సుకోవాలి. 

అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌లో అవస‌ర‌మైన ప్రాథ‌మ‌క చికిత్స కోసం ఆసుప‌త్రి ఖ‌ర్చుల‌ను రెండు ప్లాన్లూ క‌వ‌ర్ చేస్తాయి. అయితే, సాధార‌ణ ప్లాన్లలో కొన్ని ష‌రుతులు ఉంటాయి. కొన్ని ప్ర‌త్యేక సంద‌ర్భాల‌లో ఇవి క‌వ‌ర్ చేయవు.  అలాగే బీమా మొత్తం కూడా ప‌రిమితంగా ఉండ‌చ్చు. 

సాధారణ ఆరోగ్య బీమా పథకం పరిమిత కవరేజీతో వస్తుంది. ఇది ప్రీ అండ్ పోస్ట్ వైద్య ఖ‌ర్చుల‌ను క‌వ‌ర్ చేయ‌డంతో పాటు బీమా చేసిన వ్య‌క్తి 24 గంట‌ల కంటే ఎక్కువ స‌మ‌యం ఆసుప‌త్రిలో ఉండాల్సి వ‌స్తే రోగనిర్ధారణ రుసుములు, ఔషధ ఖర్చులు, డాక్టర్ కన్సల్టేషన్ రుసుములు, గది అద్దె మొద‌లైన వాటిని క‌వ‌ర్ చేస్తుంది. కొన్ని పాల‌సీలు, డే కేర్ సేవ‌లు, అంబులెన్స్ ఖ‌ర్చులు, ముందస్తు వ్యాధులు(నిర్ధిష్ట‌ వెయిటింగ్ పిరియ‌డ్ త‌ర్వాత‌), మెడిక‌ల్ చెక‌ప్‌ల‌కు అయిన ఖ‌ర్చుల‌ను క‌వ‌ర్‌ చేస్తాయి.

మరోవైపు, స‌మ‌గ్ర ఆరోగ్య బీమా.. రెగ్యుల‌ర్ హెల్త్ చెక‌ప్‌ల‌తో పాటు క్రిటిక‌ల్ ఇల్‌నెస్‌, కోవిడ్‌-19 వంటి తెలియ‌ని వ్యాధుల ఖ‌ర్చును క‌వ‌ర్ చేస్తుంది. నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రుల‌లో న‌గ‌దు ర‌హిత‌ చికిత్స‌, అంబులెన్స్ క‌వ‌రేజ్‌, డే కేర్ సేవ‌లు, ప్ర‌త్యామ్నాయ చికిత్స‌లు, వినియోగ ఖ‌ర్చులు.. వంటి వివిధ ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.

అంతేకాకుండా, చాలా వ‌ర‌కు సమగ్ర ఆరోగ్య బీమా పథకాలు ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ (ఓపీడి) ఖర్చులను కవర్ చేయ‌డంతో పాటు నిర్థిష్ట యాడ్-ఆన్లు, రైడర్‌లను అందిస్తున్నాయి. నిర్ధిష్ట వెయిటింగ్ పిరియ‌డ్ తర్వాత ఇప్పటికే ఉన్న వ్యాధులనూ క‌వ‌ర్ చేస్తాయి. కొన్ని బీమా సంస్థలు ఫిజియోథెరపీ, హోమియోపతి, ఆక్యుపంక్చర్, ఆస్టియోపతికి కూడా పరిమిత కవర్‌ను అందిస్తాయి.

భార‌త్‌లో అందుబాటులో ఉన్న కొన్ని స‌మ‌గ్ర ఆరోగ్య బీమా పాల‌సీలు ఇప్పుడు చూద్దాం: 

source: PolicyBazer

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని