Home Loan: రూ.2 కోట్ల వరకు గృహ రుణాలకూ 6.66% వడ్డీయే

రూ.2 కోట్ల వరకు గృహ రుణాలు తీసుకునే గృహ కొనుగోలుదార్లకు శుభవార్త. ఇప్పటి వరకు రూ.50 లక్షల్లోపు గృహ రుణాలకు మాత్రమే అందుబాటులో ఉన్న అతి తక్కువ గృహ రుణ రేటు 6.66 శాతాన్నే రూ.2 కోట్ల రుణాల వరకూ వర్తింపజేయనున్నట్లు....

Published : 24 Sep 2021 13:31 IST

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌

ముంబయి: రూ.2 కోట్ల వరకు గృహ రుణాలు తీసుకునే గృహ కొనుగోలుదార్లకు శుభవార్త. ఇప్పటి వరకు రూ.50 లక్షల్లోపు గృహ రుణాలకు మాత్రమే అందుబాటులో ఉన్న అతి తక్కువ గృహ రుణ రేటు 6.66 శాతాన్నే రూ.2 కోట్ల రుణాల వరకూ వర్తింపజేయనున్నట్లు ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌) వెల్లడించింది. ఈ రుణ రేటును గత జులై నుంచి అమల్లోకి తీసుకొచ్చిన ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్, ఈ నెల 22 నుంచి నవంబరు 30 వరకు మంజూరు చేసే గృహ రుణాలకు కూడా వర్తింపజేయనున్నట్లు తెలిపింది. సిబిల్‌ స్కోరు 700 అంత కంటే ఎక్కువ ఉన్న ఖాతాదార్లకు వారి వృత్తితో నిమిత్తం లేకుండా రుణాలు జారీ చేస్తామని కంపెనీ ఎండీ, సీఈఓ వై.విశ్వనాథ గౌడ్‌ వెల్లడించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని