ఎల్‌ఐసీ నుంచి కొత్త పాలసీ

భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) మరో కొత్త పాలసీని తీసుకొచ్చింది. బీమా రక్షణతోపాటు, పొదుపు కోసం ఉపయోగపడేలా దీన్ని రూపొందించారు.......

Published : 16 Mar 2021 13:09 IST

ముంబయి: భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) మరో కొత్త పాలసీని తీసుకొచ్చింది. బీమా రక్షణతోపాటు, పొదుపు కోసం ఉపయోగపడేలా దీన్ని రూపొందించారు. బచత్‌ ప్లస్‌గా పేర్కొంటున్న ఈ పాలసీని కనీసం రూ.లక్ష నుంచి తీసుకోవాలి. గరిష్ఠ పరిమితి లేదు. ఒకేసారి లేదా ఐదేళ్ల పరిమితకాలం పాటు ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది. పాలసీదారుడు మరణించిన సందర్భంలో రెండు విధాలుగా పరిహారం చెల్లిస్తారు. అయిదేళ్ల లోపు మరణించినప్పుడు నిబంధనల ప్రకారం పాలసీ విలువను చెల్లిస్తారు. అయిదేళ్ల తర్వాత పాలసీదారుడికి ఏదైనా జరిగితే.. పరిహారంతో పాటు, లాయల్టీ అడిషన్‌ లాంటివి చెల్లిస్తారు. పాలసీని క్లెయిం చేసుకోవాల్సిన అవసరం రాకపోతే.. వ్యవధి తీరిన తర్వాత మెచ్యూరిటీ విలువకు, లాయల్టీ అడిషన్‌ జోడించి అందిస్తారు. 180 రోజుల పాటు మాత్రమే ఈ పాలసీ అమ్మకానికి ఉంటుంది.

ఇవీ చదవండి...

ఎల్‌ఐసీ నుంచి బీమా జ్యోతి

పెరగనున్న టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం! ఎందుకంటే..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు