ప్ర‌యాణ భ‌త్యం గురించి మీకు తెలియ‌ని 10 విష‌యాలు

సెల‌వుల‌తో కూడిన ప్ర‌యాణ భ‌త్యం అదేనండి లీవ్ ట్రావెల్ అల‌వెన్సు (ఎల్‌టీఏ) అంటే ఉద్యోగుల‌కు సుప‌రిచిత‌మైన ప‌ద‌మే. సంస్థ‌లు ఉద్యోగులకు ప్ర‌యోజ‌నాల్లో భాగంగా దీన్ని క‌ల్పిస్తుంటాయి.....

Published : 16 Dec 2020 17:14 IST

సెల‌వుల‌తో కూడిన ప్ర‌యాణ భ‌త్యం గురించి 10 ముఖ్య‌మైన విష‌యాలు ఇవే

సెల‌వుల‌తో కూడిన ప్ర‌యాణ భ‌త్యం అదేనండి లీవ్ ట్రావెల్ అల‌వెన్సు (ఎల్‌టీఏ) అంటే ఉద్యోగుల‌కు సుప‌రిచిత‌మైన ప‌ద‌మే. సంస్థ‌లు ఉద్యోగులకు ప్ర‌యోజ‌నాల్లో భాగంగా దీన్ని క‌ల్పిస్తుంటాయి.

ఎల్‌టీఏ గురించిన 10 విశేషాలు:

  1. ఈ ప్ర‌యాణ భ‌త్యం భార‌త‌దేశంలో ప్ర‌యాణించినందుకు మాత్ర‌మే ఇస్తారు.
  2. జీవిత భాగ‌స్వామి, పిల్ల‌లు, మ‌నపై ఆధార‌ప‌డిన‌వారు అంటే త‌ల్లిదండ్రుల‌తో పాటు చేసిన ప్ర‌యాణానికి భ‌త్యం పొందొచ్చు.
  3. నాలుగు క్యాలెండ‌ర్ సంవ‌త్స‌రాల‌లో రెండు సార్లు చేసే యాత్ర‌ల‌కే ఈ భ‌త్యం వ‌ర్తిస్తుంది. ప్ర‌స్తుతం 2018-2021 సంవ‌త్స‌రాలవి న‌డుస్తున్నాయి.
  4. ఒక ప్ర‌యాణ భ‌త్యాన్ని క్యారీ ఫార్వ‌ర్డ్ చేసుకునే వీలుంది. అంటే 2014-17 మ‌ధ్య‌లో దీన్ని ఉప‌యోగించ‌క‌పోతే 2018 ప్ర‌యాణ భ‌త్యం వాడుకునే వీలుంది.
  5. ప్ర‌యాణం చేసిన‌ట్టుగా టికెట్లు, బోర్డింగ్ పాసులు, బిల్లులు లాంటివి మ‌నం ప‌నిచేసే సంస్థ‌కు స‌మ‌ర్పించాలి.
  6. ఉద్యోగి ప్ర‌యాణ భ‌త్యం క్లెయిం చేసిన కాలానికి సెల‌వులో ఉండాలి.
  7. ప్ర‌యాణ భ‌త్యం క్లెయిం చేసుకోక‌పోతే మొత్తం ఈ సొమ్ము అంతా ఆదాయానికి జ‌త‌చేసి అందుకు త‌గిన ప‌న్ను విధిస్తారు.
  8. రైల్వే, విమాన‌, ఇత‌ర ప్ర‌జా ర‌వాణా ప్ర‌యాణ ఖ‌ర్చుల‌కు ఎల్‌టీఏ క్లెయిం చేసుకోవ‌చ్చు.
  9. సంస్థ నుంచి ఎల్‌టీఏ రూపంలో ఎంతైతే ఆదాయం వ‌స్తుందో అంత మేర‌కు ప‌న్ను మిన‌హాయింపు కోర‌వ‌చ్చు. ఎల్‌టీఏకి మించి చేసిన ఖ‌ర్చుకు ప‌న్ను క్లెయిం పొంద‌లేం.
  10. భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ త‌మ త‌మ సంస్థ‌లు అందించే ఎల్‌టీఏల‌ను క్లెయిం చేసుకోవ‌చ్చు. అయితే ఇద్ద‌రూ ఒకే ప్ర‌యాణానికి క్లెయిం చేసుకునే వీలులేదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని