తండ్రి పేరుపై ఉన్నఇంటిని కుమారునికి బ‌దిలీ చేస్తే ఎల్‌టీసీజీ వ‌ర్తిస్తుందా?

సెక్ష‌న్ 54ఈసీ కింద కూడా మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. ఇంద‌కు గానూ మూల‌ధ‌న రాబ‌డిని నోటిఫైడ్ సెక్యూరిటీస్‌లో పెట్టుబ‌డి పెట్టవ‌ల‌సి ఉంటుంది. సెక్ష‌న్ 54జీబి కింద మిన‌హాయింపు పొందేందుకు అర్హ‌త క‌లిగిన స్టార్ట‌ప్‌ల ఈక్వీటీ షేర్ల‌లో మ‌దుపు చేయాలి. పైన పేర్కొన్న మిన‌హాయింపులు పొందేందుకు కొన్ని నియ‌మ నిభంధ‌ల‌ను అనుస‌రించ‌వ‌ల‌సి ఉంటుంది.

Published : 25 Dec 2020 13:02 IST

తండ్రి త‌న ఇంటిని కుమారునికి బ‌దిలీ చేసిన ఇంటి పై ఎటువంటి ఎల్‌టీసీజీ ప‌న్ను చెల్లించ‌న‌వ‌స‌రం లేదు. సాధార‌ణంగా ఒక వ్య‌క్తి త‌న ఆస్తిని బ‌య‌టి వ్య‌క్తుల‌కు విక్ర‌యిస్తే, క్యాపిట‌ల్ గెయిన్‌పై ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనినే దీర్ఘ‌కాల మూల‌ధ‌న ప‌న్ను (ఎల్‌టీసీజీ) అంటారు. అయితే మ‌రి ఒక‌ తండ్రి త‌న ఆస్తిని కుమారునికి విక్ర‌యించినా లేదా బ‌హ‌మ‌తిగా ఇచ్చిన‌ప్పుడు ఈ ఎల్‌టీసీజీ వ‌ర్తిస్తుందా? ఒక‌వేళ ఒక తండ్రి త‌న కుమారునికి త‌న పేరుపై ఉన్న ఇంటిని విక్ర‌యిస్తే, మూల‌ధ‌నంపై లాభం, న‌ష్టం ఏది వ‌చ్చినా దానిపై దీర్ఘ‌కాల మూల‌ధ‌న లాభం/న‌ష్టం(ఎల్‌సీజీ/ఎల‌్‌టీసీఎల్‌) వ‌ర్తిస్తుంది. అయితే ఆ ఇంటిని కొనుగోలు చేసి 24 నెల‌ల కంటే ఎక్కువ కాలం పూర్తై ఉండాలి. ఆస్తిపై వ‌చ్చిన నిక‌ర విలువ‌(విక్ర‌యించ‌గా వ‌చ్చిన మొత్తం నుంచి బ్రోక‌రేజీ రుసుములు తీసివేయ‌గా వ‌చ్చిన విలువ‌), ఆస్తి స్వాధీన‌మున‌కు, అభివృద్ది చేసేందుకు అయిన ఖ‌ర్చుల‌కు మ‌ధ్య వ్యాత్యాసాన్ని ఎల్‌టీసీజీగా లెక్కిస్తారు. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961, సెక్ష‌న్ 54 ప్ర‌కారం ఎల్టీసీజీపై ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. ఇందుకుగానూ మీరు మీ పాత ఇంటిని విక్ర‌యించ‌గా వ‌చ్చిన మొత్తంతో, ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇంటిని బ‌దిలీ చేసిన రోజు నుంచి ఒక సంవ‌త్స‌రం లేదా రెండు సంవ‌త్స‌రాల‌లోపుల కొత్త ఇంటిని కోనుగోలు చేయాలి. ఇళ్లు నిర్మించుకుంటున్న సంద‌ర్భంలో 3 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధి ఉంటుంది. మీరు కొనుగోలు చేసే కొత్త ఇల్లు ధ‌ర‌, పాత ఇంటిపై వ‌చ్చిన మూల‌ధ‌న లాభం కంటే ఎక్కువ‌గా ఉంటే పూర్తిగా ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. లేదంటే కొత్త ఇంటి కొనుగోలు ధ‌ర వ‌ర‌కు మాత్ర‌మే ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు అవ‌కాశం ఉంటుంది.

సెక్ష‌న్ 54ఈసీ కింద కూడా మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. ఇంద‌కు గానూ మూల‌ధ‌న రాబ‌డిని నోటిఫైడ్ సెక్యూరిటీస్‌లో పెట్టుబ‌డి పెట్టవ‌ల‌సి ఉంటుంది. సెక్ష‌న్ 54జీబి కింద మిన‌హాయింపు పొందేందుకు అర్హ‌త క‌లిగిన స్టార్ట‌ప్‌ల ఈక్వీటీ షేర్ల‌లో మ‌దుపు చేయాలి. పైన పేర్కొన్న మిన‌హాయింపులు పొందేందుకు కొన్ని నియ‌మ నిభంధ‌ల‌ను అనుస‌రించ‌వ‌ల‌సి ఉంటుంది.

అయితే మీ తండ్రి గారు ఆయ‌న పేరు మీద ఉన్న ఇంటిని బ‌హుమ‌తిగా, విల్లు ద్వారా గానీ, గిఫ్ట్‌/ వార‌స‌త్త్వంగా గానీ మీ పేరు మీద‌కి బ‌దిలీ చేస్తే, మీ తండ్రి గారు గానీ, మీరు గానీ ఎటువంటి ప‌న్ను చెల్లించ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు. మీరు బ‌హుమ‌తిగా కొంత న‌గ‌దును , మీ తండ్రి గారి పేరున జ‌మ చేసిన ప‌న్ను చెల్లించ‌వ‌ల‌సిన ప‌నిలేదు. అయితే ఈ మొత్తాన్ని ఎందులో నైనా పెట్టుబ‌డి పెడితే దానిపై వ‌చ్చే రాబ‌డిపై ప‌న్ను చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది.

సాధార‌ణంగా, స్థిరాస్తిని బ‌హుమ‌తిగా ఇచ్చేప్పుడు గిప్ట్‌డీడ్ వ్రాయించి సంబంధిత రాష్ట్ర ప్ర‌భుత్వ నియ‌మాల ప్ర‌కారం స్టాంప్ డ్యూటీని చెల్లించి ఒక‌రి పేరు మీద నుంచి మ‌రొక‌రి పేరు మీద‌కి ఆస్తిని బ‌దిలీచేసుకోవ‌చ్చు. అదేవిధంగా న‌గ‌దును బహుమ‌తిగా ఇచ్చిన‌ప్పుడు చ‌ట్ట‌బ‌ద్ధంగా గిప్ట్‌డీడ్ వ్రాయించ‌వ‌ల‌సి ఉంటుంది. స‌రైన ప‌ద్ద‌తిలో ప‌త్రాలు త‌యారు చేయించుకొనేందుకు, స్టాంప్ డ్యూటీ చెల్లించేందుకు చ‌ట్ట‌ప‌ర‌మైన స‌ల‌హాలు తీసుకోవ‌డం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని