Lenskart: లెన్స్‌కార్ట్‌లోకి రూ.1,647.64 కోట్ల నిధులు

ఆన్‌లైన్‌తో పాటు దుకాణాలలో వివిధ రకాల కళ్లజోళ్లు విక్రయించే లెన్స్‌కార్ట్‌ భారీ ఎత్తున పెట్టుబడులను సమీకరించింది. టెమాసెక్‌ హోల్డింగ్స్‌, ఫాల్కన్‌ ఎడ్జ్‌ క్యాపిటల్‌ నుంచి 220 మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.1,647.64కోట్లు) నిధులు కూడగట్టింది....

Published : 19 Jul 2021 19:20 IST

ముంబయి: ఆన్‌లైన్‌తో పాటు దుకాణాలలో వివిధ రకాల కళ్లజోళ్లు విక్రయించే లెన్స్‌కార్ట్‌ భారీ ఎత్తున పెట్టుబడులను సమీకరించింది. టెమాసెక్‌ హోల్డింగ్స్‌, ఫాల్కన్‌ ఎడ్జ్‌ క్యాపిటల్‌ నుంచి 220 మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.1,647.64కోట్లు) నిధులు కూడగట్టింది. గతంలో కేకేఆర్‌ అండ్‌ కంపెనీ నుంచి సేకరించిన 95 మిలియన్ డాలర్లతో పాటు తాజాగా సమీకరించిన నిధులను భారత్‌ సహా ఆగ్నేయాసియాలో వ్యాపార విస్తరణకు వినియోగించనున్నట్లు లెన్స్‌కార్ట్‌ ఓ ప్రకటనలో తెలిపింది. మరో 20 ఏళ్ల పాటు ప్రజల కళ్లజోళ్ల అవసరాలను తీర్చే దిశగా అడుగులు వేస్తున్నామని వ్యవస్థాపకుడు పేయుష్‌ బన్సల్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ అంకుర సంస్థ విలువ 2.5 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు వెల్లడించారు. ఈ ఏడాది భారత అంకుర సంస్థలకు అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారీ ఎత్తున నిధులు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎం కూడా భారీ ఎత్తున నిధులు సేకరించాయి. ఈ క్రమంలోనే లెన్స్‌కార్ట్‌లోకి కూడా పెట్టుబడులు రావడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని