మెజారిటీ సభ్యులు అంగీకరించారు కదా !

ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌కు చెందిన 6 మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలను రద్దు చేయడానికి మెజారిటీ వాటాదార్లు అంగీకరించారని చెబుతూ.. ఇ-ఓటింగ్‌ ప్రక్రియ ఫలితాలపై వచ్చిన అభ్యంతరాలను సుప్రీం కోర్టు

Published : 13 Feb 2021 00:41 IST

అభ్యంతరాలు తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ పథకాల రద్దు కేసు

దిల్లీ: ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌కు చెందిన 6 మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలను రద్దు చేయడానికి మెజారిటీ వాటాదార్లు అంగీకరించారని చెబుతూ.. ఇ-ఓటింగ్‌ ప్రక్రియ ఫలితాలపై వచ్చిన అభ్యంతరాలను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ అంశంలో తాము జారీ చేసిన ఆదేశాల ప్రకారమే పథకాల రద్దు, యూనిట్‌ హోల్డర్లకు నిధుల పంపిణీ ఉంటుందని కోర్టు తెలిపింది. అదే సమయంలో అన్ని సెక్యూరిటీలు లేదా ఆస్తుల నగదీకరణ వరకు వేచిచూడకుండా దశలవారీగా నిధులు పంపిణీ చేయాలని ఆదేశించింది. గతేడాది డిసెంబరులో ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌కు చెందిన ఆరు పథకాల రద్దుకు ఇ-ఓటింగ్‌ జరిగింది. బాండ్‌మార్కెట్లో ద్రవ్యలభ్యత లేకపోవడం; పెట్టుబడుల ఉపసంహరణకు ఒత్తిడి పెరగడం వల్ల వాటిని రద్దు చేస్తున్నట్లు ఏప్రిల్‌ 23న ఆ కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘మెజారిటీ వాటాదార్ల అనుమతి అంటే, పథకంలో ఉన్న యూనిట్‌హోల్డర్లు అందరూ అని కాదని.. ఓటింగ్‌లో పాల్గొన్న వారిలో మెజారిటీ సభ్యులని ధర్మాసనం స్పష్టం చేసింది. ఓటింగ్‌ ఫలితాలపై వచ్చిన అన్ని అభ్యంతరాలను తిరస్కరిస్తున్నట్లు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం తన 54 పేజీల ఆదేశాల్లో వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని