
నివాస, వాణిజ్య ఆస్తులపై తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు
ఆస్తులు తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం పాత కాలం నుండి ఉంటున్నదే. కానీ ఈ మధ్యన ఈ రుణాలు సులభంగా తక్కువ వడ్డీ రేట్లకే ఉండేలా బ్యాంకులు ప్లాన్ చేస్తున్నాయి. చాలా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, అనేక `ఎన్‌బీఎఫ్‌సీ`లు నివాస, వాణిజ్య ఆస్తులు, గోడౌన్లు తనఖా పెట్టుకుని 20 సంవత్సరాల వరకు కూడా కాలపరిమితితో రుణాలు అందిస్తున్నాయి. వ్యాపార పెట్టుబడులకు, గృహ పునరుద్దరణ, హాస్పిటలైజేషన్ ఖర్చులు, పిల్లల పెళ్లి, ఉన్నత విద్య వంటి పెద్ద అవసరాలకు ఈ రుణం ఎంతో ఉపయోగముంటుంది. గ్యారంటీ హామిపై లభించే ఈ రుణాలు సాధారణంగా వ్యక్తిగత రుణాలకంటే తక్కువ వడ్డీ రేట్ల వద్ద లభిస్తాయి.
అనేక బ్యాంకులు తనఖా పెట్టిన ఆస్తి ప్రస్తుత మార్కెట్ విలువలో 65% వరకు రుణాలిస్తుండగా, కొన్ని బ్యాంకులు నియమ నిబంధనలు బట్టి ఆస్తి విలువలో 80%, 90% వరకు రుణం అందించవచ్చు. రూ. 15 లక్షల నుండి 7 కోట్ల వరకు రుణం అందించే బ్యాంకులు ఉన్నాయి. తనఖా పెట్టిన ఆస్తి నివాస లేదా వాణిజ్యపరమైనవి అయితే వీటి సంబంధిత నిబంధనలు, షరతులు వేరు వేరుగా ఉండవచ్చు. అలాగే ఆస్తి చాలా పాతది, శిధిలమై ఉన్నా లేక వివాదాస్పదమైన యజమాన్యాన్ని కలిగి ఉన్నా, ఆస్తికి యజమానులు ఎక్కువ మంది ఉన్నా రుణం పొందడానికి ఇబ్బందులు ఉండటమో, తిరస్కరణకు గురవ్వడమో జరుగుతుంది. బ్యాంక్ రుణ ధరఖాస్తును ప్రాసెస్ చేసేటప్పుడు ఇతర అర్హత అవసరాల మధ్య మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. క్రెడిట్ స్కోరు 750 కంటే ఎక్కువ ఉంటే మాత్రమే మీకు అందుబాటులో ఉన్న అతి తక్కువ వడ్డీ రేటు, తిరిగి చెల్లించే నిబంధనలు సరళంగా ఉండేలా ఏర్పాట్లు ఉంటాయి. చాలా బ్యాంకులు సాధారణంగా 1% ప్రాసెసింగ్ రుసుమును వసూలు చేస్తాయి.
ఆస్తులను తనఖా పెట్టి రుణాన్ని తీసుకోవాలని ప్రయత్నిస్తుంటే సంవత్సరానికి వడ్డీలు 8% నుండి ప్రారంభమవుతున్నాయి. 17 ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల లిస్ట్ ఇక్కడ ఉంది. రూ 7.5 లక్షల రుణం కోసం 10 సంవత్సరాల కాల పరిమితికి `ఈఎమ్ఐ` ఈ దిగువ పట్టికలో ఉంది.
ఈఎమ్ఐ లెక్క కట్టేటప్పుడు ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు పరిగణించబడలేదు. వర్తించే వడ్డీ రేటు, ఈఎమ్ఐ మొత్తం మీరు ఎంచుకున్న బ్యాంక్, మీ ఆస్తి తరగతి, ప్రస్తుత ఆస్తి మార్కెట్ విలువ, రుణ మొత్తం, చెల్లింపు కాలవ్యవధి, బ్యాంక్ ఇతర నిబంధనలు, షరతుల ఆధారంగా విభిన్నంగా ఉండవచ్చు.
ఈ డేటా 31 ఆగస్టు 2021 నాటిది.
*షరతులు వర్తిస్తాయి.