ఓలా విద్యుత్తు స్కూటర్‌కు రుణం!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా ప్రైమ్‌, టాటా క్యాపిటల్‌ వంటి ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో తాము భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఓలా ఎలక్ట్రిక్‌ సోమవారం వెల్లడించింది. ఎస్‌1 విద్యుత్‌..

Published : 07 Sep 2021 02:03 IST

బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో సంస్థ ఒప్పందాలు

దిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా ప్రైమ్‌, టాటా క్యాపిటల్‌ వంటి ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో తాము భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఓలా ఎలక్ట్రిక్‌ సోమవారం వెల్లడించింది. ఎస్‌1 విద్యుత్‌ స్కూటర్‌ కొనుగోలు చేసే వినియోగదార్లకు రుణాలు అందించేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. ఈ నెల 8 నుంచి ఈ స్కూటర్లు కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది. కంపెనీ గత నెల 15న ఓలా ఎస్‌1 విద్యుత్‌ స్కూటర్లను రెండు వేరియంట్లలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎస్‌1, ఎస్‌1 ప్రో వేరియంట్ల ధరలు వరుసగా రూ.99,999, రూ.1,29,999గా నిర్ణయించింది. ‘బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌లతో కూడా ఒప్పందం చేసుకున్నామ’ని ఓలా ఎలక్ట్రిక్‌ ముఖ్య మార్కెటింగ్‌ అధికారి వరుణ్‌ దూబే వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని