రాబోయే లాక్‌డౌన్ల వ‌ల్ల న‌ష్ట‌మెంత‌?

యూఎస్‌, బ్రెజిల్ దేశాల‌లో 2వ‌, 3వ ద‌శ‌ల‌లో అత్య‌ధిక ప్ర‌భావ‌మైన ప‌రిస్థితి కంటే భార‌త్‌లో తాజా వైర‌స్ కేసుల తీవ్ర‌త ఎక్కువుంది.

Updated : 14 Apr 2021 15:11 IST

భార‌త్‌లో లాక్‌డౌన్లు వారానికి 1.25 బిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కోత‌కు గురి చేస్తాయి. జీడిపీ నుండి 140 బీపీఎస్‌ల‌ను త‌గ్గించ‌వ‌చ్చ‌ని ఒక నివేదిక పేర్కొంది. ప్ర‌స్తుత అంక్ష‌లు మే చివ‌రి వ‌ర‌కు అమ‌లులో ఉంటే ఆర్థిక‌, వాణిజ్య కార్య‌క‌లాపాల న‌ష్టాలు సుమారు 10.5 బిలియ‌న్ డాల‌ర్లు లేదా జీడిపీలో 34 బీపీఎస్ ఉంటుంద‌ని బ్రిటీష్ బ్రోక‌రేజ్ బార్క్లేస్ తెలిపారు.

యూఎస్‌, బ్రెజిల్ దేశాల‌లో 2వ‌, 3వ ద‌శ‌ల‌లో అత్య‌ధిక ప్ర‌భావ‌మైన ప‌రిస్థితి కంటే భార‌త్‌లో తాజా వైర‌స్ కేసుల తీవ్ర‌త ఎక్కువుంది. ఈ మంగ‌ళ‌వారం రోజుకు 1.62 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు సంక్ర‌మించి 879 మంది మ‌ర‌ణించారు.

ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా కేసుల సంఖ్య‌ 1.37 కోట్ల‌కు, మ‌ర‌ణాల సంఖ్య 1,71,058గా ఉంద‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా తెలిపింది.

ప‌రిస్థితుల దృష్టా 2 వారాల పూర్తి లాక్‌డౌన్ ఆలోచ‌న‌తో మ‌హారాష్ట్ర ముందుకెళుతోంది.

ఈ కేసుల‌లో 81 శాతానికి పైగా కేవ‌లం 8 రాష్ట్రాల్లో కేంద్రీకృత‌మై ఉన్నాయి. అయితే వాటిలో ఎక్కువ భాగం ఆర్థికంగా చురుకైన రాష్ట్రాలు, అందువ‌ల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై పెను ప్ర‌భావం క‌నిపిస్తుంది.

గ‌త కొన్ని రోజులుగా కీల‌క‌మైన ఆర్థిక కేంద్రాల‌లో పెరుగుతున్న లాక్‌డౌన్లు /  మొబిలిటి అంక్ష‌లు, రాత్రి క‌ర్ఫ్యూలు ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు వారానికి 1.25 బిలియ‌న్ డాల‌ర్లు న‌ష్ట‌పోయే అవ‌కాశ‌ముంది. ఇది వారం ముందు ఈ న‌ష్టం 0.52 బిలియ‌న్ డాల‌ర్లు మాత్ర‌మే.

మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, త‌మిళ‌నాడు, రాజ‌స్థాన్ యొక్క ముఖ్య ఆర్థిక కేంద్రాల‌లో పెరుగుతున్న కేసుల వ‌ల్ల 60% ఆర్థిక వ్య‌వ‌స్థ ప్ర‌భావిత‌మైంది. అన్ని ప్ర‌ధాన ఇన్ఫెక్ష‌న్ హాట్ స్పాట్‌ల‌లో ముంబై, పూణేలు ఎక్కువ‌గా దెబ్బ‌తిన్నాయి.

జాతీయ జీడీపికి 16 శాతానికి పైగా దోహ‌ద‌ప‌డే మ‌హారాష్ట్ర‌లో పెరుగుతున్న కేసుల నేప‌థ్యంలో ఈ ఆర్ధిక సంవ‌త్స‌రంలో జాతీయ ఆర్థిక స్థాయిలో స్థూల విలువ ఆధారిత వృద్ధిని 0.32% త‌గ్గిస్తాయ‌ని కేర్ రేటింగ్స్ నివేదిక తెలిపింది.

కొత్త‌గా లాక్‌డౌన్స్‌, ఆంక్ష‌ల వ‌ల్ల ఈ నెల‌లో సుమారు రూ. 40 వేల కోట్ల జీవీఏ న‌ష్టం క‌లుగుతుంది. అంక్ష‌లు పొడిగించ‌డంవ‌ల్ల  అధిక ఉత్ప‌త్తి న‌ష్టం సంభ‌విస్తుంది.

భార‌త్‌లో  2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో 11% వృద్ధిని ఆర్ధిక వేత్త‌లు అంచ‌నా వేశారు. కానీ మ‌రిన్ని రాష్ట్రాల‌ క‌ఠిన అంక్ష‌ల వ‌ల్ల ఈ వృద్ధి  క‌ష్ట‌మేన‌ని ఆర్థిక వేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు. అయితే మే చివ‌రి నాటికి కొత్త క్రియాశీల కేసుల సంఖ్య స్థిరీక‌రంచే అవ‌కాశ‌ముంద‌ని వారు న‌మ్ముతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని