ఎల్‌టీఆర్ఓ ఎలా ప‌నిచేస్తుంది?

‌గ‌త ప‌ర‌ప‌తి విధాన స‌మీక్ష‌లో ఆర్‌బీఐ పాల‌సీ రేట్ల‌లో కోత విధించ‌డానికి బ‌దులుగా లాంగ్ ట‌ర్మ్ రెపో ఆప‌రేష‌న్ (ఎల్‌టీఆర్ఓ) ప్ర‌వేశ‌ప‌ట్టింది. వ్య‌వ‌స్థ‌లో లిక్విడిటీ పెంచే ఉద్దేశంతో, రేట్ల త‌గ్గింపు ప్ర‌యోజ‌నాన్ని వినియోగ‌దారుల‌కు బ‌దిలీ చేసేందుకు దీనిని తీసుకొచ్చింది. ఎల్‌టీఆర్‌ఓ కింద, ఆర్‌బీఐ ప్రస్తుత రెపో రేటుతో బ్యాంకులకు దీర్ఘకాలిక (ఒకటి నుంచి మూడేళ్ల) రుణాలను అందిస్తుంది...

Published : 18 Dec 2020 16:12 IST

‌గ‌త ప‌ర‌ప‌తి విధాన స‌మీక్ష‌లో ఆర్‌బీఐ పాల‌సీ రేట్ల‌లో కోత విధించ‌డానికి బ‌దులుగా లాంగ్ ట‌ర్మ్ రెపో ఆప‌రేష‌న్ (ఎల్‌టీఆర్ఓ) ప్ర‌వేశ‌ప‌ట్టింది. వ్య‌వ‌స్థ‌లో లిక్విడిటీ పెంచే ఉద్దేశంతో, రేట్ల త‌గ్గింపు ప్ర‌యోజ‌నాన్ని వినియోగ‌దారుల‌కు బ‌దిలీ చేసేందుకు దీనిని తీసుకొచ్చింది. ఎల్‌టీఆర్‌ఓ కింద, ఆర్‌బీఐ ప్రస్తుత రెపో రేటుతో బ్యాంకులకు దీర్ఘకాలిక (ఒకటి నుంచి మూడేళ్ల) రుణాలను అందిస్తుంది. తక్కువ రేటుతో బ్యాంకులు దీర్ఘకాలిక నిధులను పొందడంతో, వారి నిధుల ఖర్చు పడిపోతుంది. దీంతో వారు రుణగ్రహీతలకు వడ్డీ రేట్లను తగ్గిస్తారు. పాలసీ రేట్లను తగ్గించకుండా, బ్యాంకులు తమ నిధుల ఆధారిత రుణ రేటు ఉపాంత వ్యయాన్ని (ఎంసీఎల్ఆర్‌) తగ్గించేలా సహాయపడింది.

ఆర్‌బీఐ తన ద్రవ్య విధానం కోసం రెపో రేట్లను సవరించడం, ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలను నిర్వహించడంపై ఆధారపడటమే కాకుండా, దాని ఉద్దేశించిన లక్ష్యాలను సాధించడానికి కొత్త సాధనాలను ఉపయోగిస్తుంది. ఎల్‌టీఆర్ఓ ఓపెన్‌ మార్కెట్లో రుణాలు సేకరించేందుకు చెల్లించాల్సిన వడ్డీ రేటు కంటే చాలా చౌకగా నిధులను సేకరించేందుకు బ్యాంకులకు అవకాశం లభిస్తుంది. చౌకగా సేకరించే నిధులతో బ్యాంకులు తమ కస్టమర్లకు విస్తృతంగా, మరింత తక్కువ వడ్డీ రేటుకే రుణాలివ్వగలిగే అవకాశం లభిస్తుంది. మార్కెట్లో వినియోగ డిమాండ్‌ను పునరుద్ధరించేందుకు ఇది దోహదపడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు