1,577 థార్‌ ఎస్‌యూవీల రీకాల్‌..!

దేశీయ వాహనాల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా 1,577 థార్‌ ఎస్‌యూవీ డీజిల్‌ యూనిట్లను రీకాల్‌ చేసినట్లు గురువారం తెలిపింది. వీటి ఇంజిన్లలో సమస్యలు ఉండటంతో వాటిని మార్చేస్తున్నట్లు

Published : 04 Feb 2021 15:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ వాహనాల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా 1,577 థార్‌ ఎస్‌యూవీ డీజిల్‌ యూనిట్లను రీకాల్‌ చేసినట్లు గురువారం తెలిపింది. వీటి ఇంజిన్లలో సమస్యలు ఉండటంతో వాటిని మార్చేస్తున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్‌ 7వ తేదీ నుంచి డిసెంబర్‌ 25వ తేదీ మధ్య తయారు చేసిన ఈ వాహనాల్లో కామ్‌షిఫ్ట్‌ వ్యవస్థలో లోపాలు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా పరిశీలించి అవసరమైన మార్పులు చేయనుంది. 

‘‘ఆయా తేదీల్లో మాకు విడిభాగాలను సరఫరా చేసే ప్లాంట్ల యంత్రాల్లో లోపాలు తలెత్తాయి. ఆ ప్రభావం కొన్ని డీజిల్‌ ఇంజిన్‌ థార్‌ల కామ్‌షిఫ్ట్‌లపై పడే అవకాశం ఉంది’’ అని మహీంద్రా సంస్థ రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.  కంపెనీ నాణ్యత విషయంలో అప్రమత్తంగా వ్యవహరించి ముందు జాగ్రత్తగా రీకాల్‌ చేసిందని పేర్కొంది. ఈ సమస్య ఉన్న వాహనాల్లో మరమ్మతులకు ఎటువంటి ఖర్చు వసూలు చేయరని పేర్కొంది. అవసరమైన కస్టమర్లను కంపెనీ ప్రతినిధులు నేరుగా సంప్రదిస్తారని తెలిపారు. సియామ్‌ వాలంటరీ కోడ్‌కు ఇది పూర్తిగా కట్టుబడి ఉందని మహీంద్రా అండ్‌ మహీంద్రా పేర్కొంది. 

థార్‌ కొత్త వెర్షన్‌ను అక్టోబర్‌ 2న మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ మోడల్‌ రెండు ట్రిమ్‌ల్లో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఏఎక్స్‌ అండ్‌ ఎల్ఎక్స్‌ రెండు ట్రమ్‌లు పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్లతో లభిస్తున్నాయి. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని