మారుతీ జిమ్నీ ఎగుమతులు ప్రారంభం

అగ్రగామి వాహన దిగ్గజం మారుతీ సుజుకీ కాంపాక్ట్‌ ఆఫ్‌-రోడర్‌ జిమ్నీ వాహన ఎగుమతులను ప్రారంభించింది.

Published : 21 Jan 2021 00:58 IST

దిల్లీ: అగ్రగామి వాహన దిగ్గజం మారుతీ సుజుకీ కాంపాక్ట్‌ ఆఫ్‌-రోడర్‌ జిమ్నీ వాహన ఎగుమతులను ప్రారంభించింది. ఈ మోడల్‌కు అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రంగా భారత్‌ను మార్చాలని మాతృసంస్థ సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ చూస్తోంది. లాటిన్‌ అమెరికా దేశాలైన కొలంబియా, పెరూలకు ముంద్రా పోర్ట్‌ నుంచి 184 జిమ్నీ వాహనాలను ఎగుమతి చేసినట్లు మారుతీ సుజుకీ తెలిపింది. మూడు డోర్లు కలిగిన సుజుకీ జిమ్నీని మధ్య ప్రాచ్య, ఆఫ్రికా దేశాలకు సైతం భారత్‌ నుంచి ఎగుమతి చేయనున్నట్లు వెల్లడించింది. గత 50 ఏళ్లుగా అంతర్జాతీయ విపణిలో జిమ్నీ మోడల్‌ ఉంది. ప్రస్తుత తరం మోడల్‌ను 2018లో విడుదల చేశారు. 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన జిమ్నీ 5 స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌, 4 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ సదుపాయాల్లో లభిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని