Maruti Suzuki Price Hike: మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు.. ఎప్పటి నుంచంటే..

తమ సంస్థ నుంచి వస్తున్న కార్లలో చాలా మోడళ్ల ధరల్ని పెంచనున్నట్లు దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ సోమవారం ప్రకటించింది....

Updated : 30 Aug 2021 13:53 IST

దిల్లీ: తమ సంస్థ నుంచి వస్తున్న కార్లలో చాలా మోడళ్ల ధరల్ని పెంచనున్నట్లు దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ సోమవారం ప్రకటించింది. ఈ ధరలు సెప్టెంబరు నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. అయితే, ధరలు ఎంతమేర పెరగనున్నాయనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తయారీ, నిర్వహణ, ముడిసరకుల వ్యయాలు ఎగబాకడమే ధరల పెంపునకు కారణంగా వివరించింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. మోడల్‌ని బట్టి ధరల పెంపు మారుతుందని తెలిపింది. ఈ సంవత్సరంలో జనవరి నుంచి మారుతీ ధరలు పెంచడం ఇది నాలుగోసారి. జనవరి 18న గరిష్ఠంగా కొన్ని మోడళ్లపై రూ.34,000 వరకు, ఏప్రిల్‌లో ఎక్స్‌షోరూం ధరలపై 1.6 శాతం పెంపు అమలు చేసింది. జులైలోనే స్విఫ్ట్‌ హాచ్‌బ్యాక్‌ సహా అన్ని సీఎన్‌జీ మోడళ్ల ధరలను పెంచింది. ఈ నేపథ్యంలో ఈ వాహనాల ధరలను మళ్లీ పెంచుతారో.. లేదో.. తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని