Maruti Suzuki: స్మార్ట్‌ ఫైనాన్స్‌ను ప్రారంభించిన మారుతీ

మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌ వినియోగదారులకు ప్రత్యేక సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. వినియోగదారులు కార్ల కొనుగోలుకు అవసరమైన ఫైనాన్స్‌ను మారుతీ

Updated : 11 Jul 2021 23:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌ వినియోగదారులకు ప్రత్యేక సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. వినియోగదారులు కార్ల కొనుగోలుకు అవసరమైన ఫైనాన్స్‌ను మారుతీ సుజుకీ స్మార్ట్‌ ఫైనాన్స్‌నులో చేసుకోవచ్చని పేర్కొంది. ఈ సేవలు దేశవ్యాప్తంగా ఎరీనా, నెక్సా వినియోగదారులు వాడుకోవచ్చని తెలిపింది. వివధ రకాల కస్టమర్లకు అవసరమైన సేవలు మొత్తం దీనిలో అందుబాటులో ఉండనున్నాయి. 

భారత్‌లో వినియోగదారుల అవసరాల మేరకు వివిధ రకాల ఫైనాన్సింగ్‌ సేవలను, వివిధ ఫైనాన్షియర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి సంస్థ మారుతీనే. దీనిలో రియల్‌ టైమ్‌ లోన్‌ ట్రాకింగ్‌ అందుబాటులో ఉంటుంది. డిసెంబర్‌ 2020 మారుతీ సుజుకీ స్మార్ట్‌ ఫైనాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం దీనిని 25 లక్షల మంది వినియోగదారులు విజిట్‌ చేశారు. మారుతీ సుజీకి స్మార్ట్‌ ఫైనాన్స్‌ అనేది వన్‌ స్టాప్‌ ఫైనాన్స్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ అని, దీనిలో వినియోగదారులు తమకు నచ్చిన ఫైనాన్స్‌ భాగస్వామిని, స్కీమ్‌ను ఎంచుకోవచ్చని సంస్థ తెలిపింది. రుణానికి సంబంధించిన అన్ని ప్రకియలను ఇందులో పూర్తిచేయనున్నట్లు సంస్థ పేర్కొంది. దీనిపై కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటీవ్‌ శశాంక్‌ శ్రీవాస్తవా మాట్లాడుతూ ‘‘షోరూమ్‌కు వెళ్లక ముందే ఆన్‌లైన్‌లో కారు వివరాలు, ఫైనాన్స్‌ వివరాలను చాలా మంది కస్టమర్లు తెలుసుకొంటున్నారు. చాలా కొనుగోళ్లు కూడా ఆన్‌లైన్‌లో పూర్తి చేస్తున్నారు. ఎండ్‌ టు ఎండ్‌ కార్‌ఫైనాన్సింగ్‌ సేవలను మా స్మార్ట్‌ ఫైనాన్స్‌ ప్లాట్‌ఫామ్‌లో ఏర్పాటు చేశాము’’ అని పేర్కొన్నారు. దీనిని గతేడాది పరిమితి పట్టణాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా నిర్వహించినట్లు తెలిపారు. దీనిలో హెచ్‌డీఎప్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్బీఐ,ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కరూర్‌ వైశ్యా బ్యాంక్‌, చోళమండలం ఫైనాన్స్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, మహీంద్రా ఫైనాన్స్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, సుందరమ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీబీ సర్వీస్‌ సంస్థలు ఫైనాన్స్‌ సౌకర్యాన్ని అందిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని