Maruti Suzuki Price Hike: నేటి నుంచి అమల్లోకి పెరిగిన మారుతీ కార్ల ధ‌ర‌లు

దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కార్ల ధరల‌ను మ‌రోసారి పెంచింది. దేశవ్యాప్తంగా దాదాపు 2శాతం పెరుగుద‌ల ఉంటుందని సంస్థ తెలిపింది.

Updated : 06 Sep 2021 13:20 IST

ముంబయి: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ.. త‌మ సంస్థ ఉత్ప‌త్తి చేస్తున్న కార్ల ధ‌ర‌ల‌ను పెంచుతున్న‌ట్లు గ‌త సోమ‌వారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. పెంచిన ధ‌ర‌లను నేటి నుంచి అమ‌ల్లోకి తెస్తున్నట్లు సంస్థ వెల్ల‌డించింది. ముడి సరకుల వ్యయాల పెరిగిన కార‌ణంగానే ధ‌ర‌లు పెంచుతున్న‌ట్లు వివ‌రించింది.

తయారీ, నిర్వహణ, ముడిసరకుల వ్యయం వంటి ఇన్‌పుట్ వ్యయాల కార‌ణంగా ఎంపిక చేసిన మోడ‌ల్స్‌పై ధ‌ర‌లను మార్పు చేస్తున్న‌ట్లు సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా కార్ల ధరల పెరుగుదల దాదాపు 2 శాతం ఉంటుంది. ఎంచుకున్న మోడళ్లలో ఎక్స్-షోరూమ్(దిల్లీ) ధరలలో సగటు పెరుగుదల 1.9శాతం ఉటుంద‌ని పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఆల్టో నుంచి ఎస్‌-క్రాస్‌ వరకు వరుసగా రూ.2.99 లక్షలు, రూ.12.39 ల‌క్ష‌ల మ‌ధ్య‌(ఎక్స్-షోరూమ్ ధరలు ధిల్లీ) ధరలతో కార్ల‌ను విక్రయిస్తోంది.

మారుతీ సుజుకీ గ‌త వారం 1,81,754 యూనిట్లను రీకాల్‌ చేసింది. వీటిల్లో సియాజ్‌, ఎర్టిగా, విటార్‌ బ్రెజా, ఎస్‌-క్రాస్‌, ఎక్స్‌ఎల్‌ 6 కార్లు ఉన్నాయి. వెనక్కి పిలిపించిన కార్లను తనిఖీ చేసి అవసరమైతే మోటార్‌ జనరేటర్లను మార్చనుంది. ఇప్పటి వరకు కంపెనీ చేపెట్టిన అతిపెద్ద వాహన రీకాల్ ఇదే. బాధ్యతాయుత‌మైన కార్పొరేట్‌గా వినియోగ‌దారుని భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని వాహ‌నాల‌ను రీకాల్ చేసిన‌ట్లు సంస్థ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని