మెక్‌డొనాల్డ్‌ 30 కొత్త కేంద్రాలు

మెక్‌డొనాల్డ్‌ రెస్టారెంట్లను దేశ దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మాస్టర్‌ ఫ్రాంచైజీ వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 25-30 కొత్త విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. వీటిల్లో 60-70 శాతం హైదరాబాద్‌, ముంబయి,

Updated : 13 May 2022 15:13 IST

70% హైదరాబాద్‌ వంటి 6 ప్రధాన నగరాల్లోనే

దిల్లీ: మెక్‌డొనాల్డ్‌ రెస్టారెంట్లను దేశ దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మాస్టర్‌ ఫ్రాంచైజీ వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 25-30 కొత్త విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. వీటిల్లో 60-70 శాతం హైదరాబాద్‌, ముంబయి, పుణె, అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నైల్లో ఏర్పాటు చేయబోతున్నట్లు, మిగతా స్టోర్లను చిన్న పట్టణాల్లో తెరుస్తామని అమిత్‌ తెలిపారు.వ్యాపారం కొవిడ్‌ ముందు పరిస్థితులకు చేరుకుంటోందని, వచ్చే త్రైమాసికం నుంచి తమ నెట్‌వర్క్‌కు మరిన్ని విక్రయ కేంద్రాలను జత చేరుస్తామని కంపెనీ తెలిపింది. ఈ త్రైమాసికంలో 3 కొత్త స్టోర్లను ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి ఏడాది 25-40 స్టోర్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యం నిర్దేశించుకున్నట్లు వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌ వైస్‌ ఛైర్మన్‌ అమిత్‌ జతియా వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని