మెగాసాఫ్ట్‌ రైట్స్‌ ఇష్యూ నిష్పత్తి ఖరారు

ఐటీ సేవల కంపెనీ మెగాసాఫ్ట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్ల బోర్డు, రైట్స్‌ ఇష్యూ నిష్పత్తిని ఖరారు చేసింది. హైదరాబాద్‌కు చెందిన...

Published : 04 Mar 2021 01:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఐటీ సేవల కంపెనీ మెగాసాఫ్ట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్ల బోర్డు, రైట్స్‌ ఇష్యూ నిష్పత్తిని ఖరారు చేసింది. హైదరాబాద్‌కు చెందిన విజువల్‌ సాఫ్ట్‌, కొన్నేళ్ల క్రితం విలీనం అయింది ఈ కంపెనీలోనే. మెగాసాఫ్ట్‌ లిమిటెడ్‌ ప్రస్తుత వాటాదార్లకు, ప్రతి 3 షేర్లకు 2 చొప్పున రైట్స్‌ షేర్లు జారీ చేయాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు తాజాగా నిర్ణయించింది. దీని ప్రకారం 2,95,02,748 రైట్స్‌ షేర్లు వాటాదార్లకు లభిస్తాయి. ఒక్కో షేరుకు రూ.10 ధర నిర్ణయించారు. పూర్తిగా చందా (సబ్‌స్క్రిప్షన్‌) లభిస్తే, కంపెనీకి రూ.29.50 కోట్లు సమకూరతాయి. దీనికి ‘రికార్డు తేదీ’ ని త్వరలో ప్రకటిస్తారు. మెగాసాఫ్ట్‌ షేర్‌ బీఎస్‌ఈలో బుధవారం రూ.10.63 ముగింపు ధరను నమోదు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని